Yevgeny Prigozhin Video Viral: ఒకప్పుడు దేశాధ్యక్షుడికి ఆయన నమ్మకస్తుడు.. ఓ రెబల్ టీమ్‌ను కూడా ఆయన నడించారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగాని అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు.. సీన్ కట్ చేస్తే చివరకు విమాన ప్రమాదంలో మరణించారు. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం ఆ తర్వాత కొన్నిరోజుల వ్యవధిలోనే ఘోర విమాన ప్రమాదంలో మరణించడం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న ప్రిగోజిన్ విమానం మార్గమధ్యంలోనే కూలిపోవడంతో మంటలు చెలరేగి ఆయనతోపాటు.. పది మందికి పైగా మరణించారు. ప్రిగోజిన్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, విమానం ఎలా కూలిపోయింది అనేది మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఘటన అనంతరం.. పుతిన్ పై పలు ఆరోపణలు సైతం తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నేను బతికే ఉన్నానంటూ ప్రిగోజిన్ చెబుతున్న వీడియో.. నెట్టింట హల్ చల్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
వాగ్నెర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణానికి కొన్ని రోజుల ముందు ఆఫ్రికాలో కనిపించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాగ్నెర్ గ్రూప్‌కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానెల్ విడుదల చేసిన చిన్న క్లిప్‌లో ప్రిగోజిన్ తన ఆరోగ్యం, అతని భద్రతకు సాధ్యమయ్యే బెదిరింపుల గురించి మాట్లాడుతూ కనిపించాడు. ఎప్పటిలానే.. దుస్తులు, టోపీ, అలాగే అతని కుడి చేతికి గడియారం ధరించి కనిపించారు. గత వారం బ్రెజిల్ తయారు చేసిన ఎంబ్రేయర్ జెట్ కూలిపోవడంతో ప్రిగోజిన్ తొమ్మిది మందితో పాటు మరణించినట్లు రష్యా పేర్కొంది. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రిగోజిన్ కనిపించడం కలకలం రేపింది.
A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death.
"So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi— Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023
కదులుతున్న వాహనంలో చిత్రీకరించిన వీడియో లొకేషన్ లేదా తేదీని టీవీ9 ధృవీకరించడం లేదు. అయినప్పటికీ, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ వీడియో ఆగస్టు 21న విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆఫ్రికాలో చిత్రీకరించినట్లు వాగ్నర్ బాస్ చెప్పడం వినవచ్చు. “నేను బతికే ఉన్నానా లేదా అని చర్చించుకుంటున్న వారికి, నేను ఎలా ఉన్నాను అనేది ముఖ్యం.. ప్రస్తుతం వీకెండ్, ఆగస్టు 2023 రెండవ సగం నేను ఆఫ్రికాలో ఉన్నాను.. నన్ను తుడిచిపెట్టడం లేదా నా వ్యక్తిగత జీవితం గురించి చర్చించడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం” అని ప్రిగోజిన్ వీడియోలో చెప్పారు. ట్విట్టర్ లో వైరల్ అవతుతున్న ఈ వీడియో చర్చకు దారితీసింది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో దీనిని ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిని షేర్ చేస్తూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రిగోజిన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు, 2 మీటర్ల భూగర్భంలో ఉన్నారని.. యూజర్లు పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం సమయంలో తనపై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ను.. క్రెమ్లిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకారంగా చంపేశాడనే వార్తలను రష్యా ఇప్పటికే ఖండించింది. అయితే, ప్రిగోజిన్ చనిపోయారా..? లేదా బతికే ఉన్నారా..? అనేది ఇప్పటికే మిస్టరీగానే మిగిలిఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..