Boris Johnson: అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్.. పార్టీగేట్ వివాదానికి తాత్కాలిక తెర

|

Jun 07, 2022 | 10:34 AM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్(UK) ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు పార్లమెంట్ లో అవిశ్వాసం ఎదుర్కొన్నారు. కొన్ని వారాలుగా, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు జాన్సన్ వరస కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారని...

Boris Johnson: అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్.. పార్టీగేట్ వివాదానికి తాత్కాలిక తెర
Boris Johnson
Follow us on

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్(UK) ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు పార్లమెంట్ లో అవిశ్వాసం ఎదుర్కొన్నారు. కొన్ని వారాలుగా, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు జాన్సన్ వరస కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. సొంత పార్టీ నుంచే ఆయనకు తిరుగుబాటు ఉన్నప్పటికీ.. చివరికి 211 ఓట్లును గెలుచుకున్నారు. అవిశ్వాస ఓటును ట్రిగ్గర్ చేయడానికి 54 ఓట్లు అవసరం. ఈ క్రమంలో బ్రిటన్ పార్లమెంట్ లో నిన్న(సోమవారం) అవిశ్వాస తీర్మానం(No-Confidence Vote) ప్రవేశపెట్టారు. ప్రధానిగా అంతకు ముందు కూడా బోరిస్ జాన్సన్ 11 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన వ్యక్తిగత నివాసాన్ని పునరుద్ధరించడం కోసం రహస్య విరాళాలను స్వీకరించడంపై వివాదాలు ఎదుర్కొన్నారు. ఈ కుంభకోణాల నుంచి ఆయన క్షేమంగా బయటపడినప్పటికీ.. ఓ విషయంలో మాత్రం అందరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సామాజిక సమావేశాలను పరిమితం చేసిన సమయంలో జాన్సన్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించాయి. ఇది ఇప్పటికే ఉన్న COVID నిబంధనలకు విరుద్ధంగా డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఈవెంట్లను ప్రస్తావించింది.

జాన్సన్ ప్రభుత్వంమునుపెన్నడూ లేని విధంగా అసమ్మతి ఎదుర్కొంటోంది. కన్జర్వేటివ్ ఎంపీలు తమ నియోజకవర్గాల నుంచి జాన్సన్‌పై వచ్చిన అనేక ఫిర్యాదులపై చర్చించారు. పార్టీగేట్, బ్రెక్సిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు జాన్సన్ ముఖ్యంగా ధిక్కార స్వరంతో మాట్లాడారు. జాన్సన్ చివరికి అవిశ్వాస తీర్మానం నుంచి విజయం సాధించినప్పటికీ, అతనికి స్వంత పార్టీకి చెందిన 148 మంది ఎంపీలు ఓటు వేయలేదు. వీరందరూ భవిష్యత్తులో బోరిస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అయితే జాన్సన్ గద్దె దిగిపోతే.. ఎవరిని తదుపరి ప్రధానిగా ప్రకటించాలనే విషయంపైనా చర్చలు జరిగాయి. ఓటు నుంచి తాత్కాలికంగా బయటపడినప్పటికీ, జాన్సన్ రాజకీయ గందరగోళ ఇంకా ముగియలేదు.

బ్రిటన్‌ పార్లమెంటులోని దిగువ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 650 ఉండగా బోరిస్‌కు చెందిన అధికార కన్సర్వేటివ్‌ పార్టీకి 359 మంది బలం ఉంది. ఆయన్ని ప్రధాని పదవి నుంచి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో తెలియదు.. బోరిస్‌ జాన్సన్‌ మీద అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నా, సొంత పార్టీలో రాజకీయంగా ఆయనకు చాలా ఇబ్బందులనే తెచ్చి పెట్టనుంది అయితే ఆయన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కితే మరో ఏడాది వరకూ ప్రధాని పదవికి ఎలాంటి డోకా ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి