Hospital Fire: కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 10 మంది కరోనా బాధితులు
యూరప్ నార్త్ మెసిడోనియాలో ఘోర ప్రమాదం జరిగింది. టెటొవా నగరంలోని ఓ కొవిడ్ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
యూరప్ నార్త్ మెసిడోనియాలో ఘోర ప్రమాదం జరిగింది. టెటొవా నగరంలోని ఓ కోవిడ్ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారితో పాటు ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా ఇతర ఆస్పత్రులకు తరలించారు.
ఇటీవల కరోనా విజృంభణతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఆ హాస్పిటల్లో ఓ పేలుడు జరిగిందని..ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని తెలిపారు అధికారులు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇవి కూడా చదవడి: బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!