Taylor Swift Cat: అయ్య బాబోయ్.. రూ.800 కోట్ల ఆస్తులకు అధిపతి ఓ పిల్లి.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?

|

Jan 07, 2023 | 9:37 AM

ప్రపంచంలో కొంతమంది అత్యంత ధనవంతులుగా ఉన్నారు.. వారి వివరాలను ఫోర్బ్స్ ఎల్లప్పుడూ ప్రకటిస్తుంటుంది. ఇదంతా ఓ లెక్కైతే.. ఓ పిల్లి ధనకమైన జంతువుల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

Taylor Swift Cat: అయ్య బాబోయ్.. రూ.800 కోట్ల ఆస్తులకు అధిపతి ఓ పిల్లి.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
Taylor Swift Cat
Follow us on

ప్రపంచంలో కొంతమంది అత్యంత ధనవంతులుగా ఉన్నారు.. వారి వివరాలను ఫోర్బ్స్ ఎల్లప్పుడూ ప్రకటిస్తుంటుంది. ఇదంతా ఓ లెక్కైతే.. ఓ పిల్లి ధనకమైన జంతువుల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. దాని పేరిట రూ.800 కోట్లు ఉన్నాయి.. వామ్మో.. పిల్లి పేరిట అన్ని కోట్లా.. ఆ మార్జాలం ఎవరిదీ.. ఎక్కడుంటుంది..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయా.. అయితే.. స్టోరీ చదివేయండి.. పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్‌కు చెందిన పెంపుడు పిల్లి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. గ్రహం మీద ఉన్న చాలా మంది వ్యక్తుల కంటే ఆ పిల్లి అత్యంత ధనవంతమైనదని పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్‌. తన పాటలతో ఆమె ఉర్రూతలూగిస్తుంటారు. మ్యూజిక్ ఆల్బమ్స్‌, యాడ్స్‌, ఇలా ఎన్నో కార్యక్రమాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. అయితే, స్విఫ్ట్‌ లాగే ఆమె పెంపుడు పిల్లి కూడా డబ్బులు వెనకేసుకోవడంలో ముందుందని రోలింగ్ స్టోన్‌లోని ఒక నివేదిక పేర్కొంది. ఒలివియా బెన్సన్‌ అనే పిల్లి.. 97 మిలియన్ల డాలర్ల (రూ. 800 కోట్లు) తో పెంపుడు జంతువుల రిచ్‌ లిస్ట్‌లో జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమించినట్లు మీడియా సంస్థ వెల్లడించింది.

ఒలివియా (పిల్లి) 2014 నుంచి టైలర్‌తోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ డేటాను ఉపయోగించి పెంపుడు జంతువులు నికరంగా ఎంత సంపాదిస్తున్నాయనే వివరాలను అంచనా వేస్తారు. అయితే ఒలివియాకు మాత్రం సొంతంగా ఇన్‌స్టా ఖాతా లేదు.. స్విఫ్ట్‌ తన ఖాతాల్లో షేర్ చేసే చిత్రాలు, వీడియోల్లో ఇది తరచూ కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ వీడియోలు, యాడ్స్‌లో ఆమెతోపాటు కలిసి నటిస్తూ ఉంటుంది. అయితే, ఒలివియా పేరు మీద సొంతంగా ఒక వ్యాపారం కూడా ఉంది. అలాగే ఈ పిల్లికి ఫ్యాన్స్ క్లబ్ పేరిట సోషల్‌ మీడియాలో విపరీతమైన పాపులారిటీ కూడా సొంతమైంది. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం టేలర్ స్విఫ్ట్ సంపద 570 మిలియన్ల డాలర్లు.. అంటే అక్షరాల రూ.4,700 కోట్లు ఉండగా.. పిల్లి పేరిట రూ.800 కోట్లు ఉన్నాయి.

క్యాట్స్ గురించి అన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్ హబ్‌ని ఉపయోగించి ఒక్కో పోస్ట్‌కు ఆయా పెంపుడు జంతువుల ఇన్‌స్టాగ్రామ్ ఆదాయాలను, అలాగే అందుకున్న లైక్‌లను అంచనా వేయడానికి ఉపయోగించినట్లు రోలింగ్ స్టోన్ నివేదిక తెలిపింది. ఆల్ అబౌట్ క్యాట్స్ ద్వారా ఫోర్బ్స్-స్టైల్ జాబితాను రూపొందించారు. ఒలివియా బెన్సన్ కంటే సియామీ, టాబీ మిక్స్ ముందంజలో ఉన్నాయి. వీటిని నికర విలువ $100 మిలియన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..