Russia-Ukraine Crisis: శాంతి మంత్రం జపిస్తున్న తాలిబన్లు.. ఆ విషయంలో రష్యా, ఉక్రెయిన్‌కు సలహా

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భారీ దాడికి యత్నిస్తోంది. మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఇక..

Russia-Ukraine Crisis: శాంతి మంత్రం జపిస్తున్న తాలిబన్లు.. ఆ విషయంలో రష్యా,  ఉక్రెయిన్‌కు సలహా

Edited By:

Updated on: Feb 26, 2022 | 5:00 PM

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భారీ దాడికి యత్నిస్తోంది. మరో 20 వేల మంది గెరిల్లా ఆర్మీని పంపేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఉక్రెయిన్‌- రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా (Russia) తీరుపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు దేశాలు ఉక్రెయిన్‌ (Ukraine)కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్‌ దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా – ఉక్రెయిన్‌ సంక్షోభం (Russia-Ukraine Crisis)పై తాలిబన్లు సైతం స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని తాలిబన్లు సూచించారు. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్ధాలు చేసుకోవడం సమస్యలు పరిష్కారం కావని, ఈ సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఆప్ఘనిస్తాన్‌ ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించారు. తాలిబన్లు శాంతి మంత్రం జపించడం అంతర్జాతీయ మీడియాలో ప్రత్యేకతను చాటుకుంది.

గత ఏడాది అఫ్గనిస్తాన్‌ సర్కార్‌పై దాడికి పాల్పడిన తాలిబన్లు అఫ్గనిస్తాన్ సైనికులు, సామాన్య ప్రజలను మట్టుబెట్టి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. అప్పటి తాలిబన్ల దాడిలో వెయ్యి మంది పౌరులు మరణించగా, 2వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు ప్రారంభం

Russia Ukraine Crisis: అలా చేయకండి.. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీలక సూచన