Switzerland: స్వలింగ సంపర్కుల వివాహాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్.. ప్రజాభిప్రాయ సేకరణలో షాకింగ్ మెజారిటీ..

|

Sep 27, 2021 | 11:02 AM

Same - Sex marriages legal: స్వలింగ సంపర్కుల వివాహాన్ని (గే మ్యారేజ్‌ను) చట్టబద్ధం చేసేలా స్విట్జర్లాండ్ ప్రజలు ఓటు వేశారు. స్వలింగ వివాహానికి మద్దతుగా.. మూడింట రెండు

Switzerland: స్వలింగ సంపర్కుల వివాహాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్.. ప్రజాభిప్రాయ సేకరణలో షాకింగ్ మెజారిటీ..
Switzerland, Same Sex Marri
Follow us on

Same – Sex marriages legal: స్వలింగ సంపర్కుల వివాహాన్ని (గే మ్యారేజ్‌ను) చట్టబద్ధం చేసేలా స్విట్జర్లాండ్ ప్రజలు ఓటు వేశారు. స్వలింగ వివాహానికి మద్దతుగా.. మూడింట రెండు వంతుల ప్రజలు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పౌర వివాహం, స్వలింగ స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునే హక్కుకు చట్టబద్దత కల్పిస్తూ.. స్విట్జర్లాండ్ ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీతో అంగీకరించింది. దీంతో పశ్చిమ ఐరోపాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశాలలో స్విట్జర్లాండ్ ఒకటిగా నిలిచింది. స్విస్ ఫెడరల్ ఛాన్సలర్ ఫలితాల ప్రకారం.. స్విట్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించిన దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో 64.1% మంది ఓటర్లు స్వలింగ వివాహానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు వేడుకలు నిర్వహించారు. స్వలింగ సంపర్కుల వివాహ మద్దతుదారులు ఆదివారం స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో వేడుకలు జరుపుకున్నారు. కేరింతలు కొడుతూ నగరంలో ర్యాలీలు తీశారు.

స్విస్ ఫెడరల్ ఛాన్సలర్ ప్రకటన అనంతరం తమకు చాలా సంతోషంగా, ఉపశమనంగా ఉందంటూ స్వలింగ వివాహ చట్టబద్దత కోసం పోరాటం చేసిన ఆంటోనియా హౌస్‌విర్త్ పేర్కొన్నారు. స్వలింగ జంటలకు పౌర వివాహానికి చట్టబద్దత కల్పించడం సమానత్వానికి మైలురాయి అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై స్విస్ పీపుల్స్ పార్టీ నాయకులు, ప్రజాభిప్రాయ కమిటీ సభ్యురాలు మోనికా రూగెగర్ నిరాశ వ్యక్తంచేశారు. నో టూ మ్యారేజ్ ఫర్ ఆల్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రేమ, భావాలకు సంబంధించింది కాదని.. పిల్లల సంక్షేమం గురించి అని.. పిల్లలు, తండ్రులు ఓడిపోయారు అంటూ ఆమె పేర్కొన్నారు.

కాగా.. సవరించిన చట్టం ప్రకారం.. స్వలింగ జంటలు వివాహం చేసుకోవడానికి, వారికి సంబంధం లేని పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వివాహితలు, లెస్బియన్ జంటలు కూడా స్పెర్మ్ డొనేషన్ ద్వారా పిల్లలను కనడానికి అనుమతిస్తారు. అయితే.. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని స్విస్ న్యాయశాఖ మంత్రి కరిన్ కెల్లర్-సుట్టర్ తెలిపారు. ఇదిలాఉంటే.. ప్రజాభిప్రాయ సేకరణలో.. 64.9% స్విస్ ఓటర్లు మూలధన లాభ పన్నును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను తిరస్కరించారు.

Also Read:

Angela Merkel: జర్మనీలో ముగిసిన ఏంజెలా మెర్కెల్‌ శకం.. పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ డెమొక్రాట్ల పైచేయి..

Canada India: భారత విమానాలపై నిషేధం ఎత్తివేసిన కెనడా.. ఈ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే.