US Capitol: అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్ కాపిటల్ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా కాపిటల్ పోలీసులు అక్కడ పరిసర ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయించారు. ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రక్కులో పేలు పదార్థాలు ఉన్నాయా అన్న దానిపై దృష్టి సారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
This is an ongoing investigation.
We are monitoring this situation closely and will update this account as we get information we can release.
— U.S. Capitol Police (@CapitolPolice) August 19, 2021
ఈ విషయమై యూఎస్ కాపిటల్ పోలీసులు మాట్లాడుతూ.. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌కు సమీపంలో అనుమానస్పద వాహనం నిలిపి ఉందన్న వార్తతో వెంటనే స్పందించాం. దీనికి సమీపంలోనే కాపిటల్ భవనంతో పాటు సూప్రీం కోర్టు ఉంది. కేనాన్ హౌజ్ ఆఫీసును కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ఇంతకీ ఆ ట్రక్కులో ఏముందో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాలి. ఇదిలా ఉంటే ట్రంప్ ఓటమి తర్వాత ఆయన మద్ధతుదారులు అమెరికా కాపిటల్ భవనంలో చేసిన హంగామా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే ఇప్పుడు అమెరికా కాపిటల్ భవనం మరోసారి వార్తల్లోకెక్కింది.
Also Read: England cricket fan Jarvo: ఇతగాడు మళ్లీ గ్రౌండ్లోకి వచ్చాడు.. ఈసారి టెంట్ వేసుకుని నిద్రపోయాడు