Student Selfies: ఓ యువకుడిని కోటిశ్వరుడిని చేసిన సెల్ఫీ సరదా.. ఐదేళ్లుగా రోజుకొక సెల్ఫీ.. ఆన్ లైన్ లో అమ్మకం..

|

Jan 24, 2022 | 11:13 AM

Student Selfies: స్మార్ట్ ఫోన్ల(Smart Phone)లో కెమెరా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎ చిన్న సమయం, సందర్భం వచ్చినా తమ చేతిలో ఉన్న ఫోన్ తో వెంటనే క్లిక్ మనిపించి

Student Selfies: ఓ యువకుడిని కోటిశ్వరుడిని చేసిన సెల్ఫీ సరదా.. ఐదేళ్లుగా రోజుకొక సెల్ఫీ.. ఆన్ లైన్ లో అమ్మకం..
Indonesian Student Accidentally Became A Millionaire
Follow us on

Student Selfies: స్మార్ట్ ఫోన్ల(Smart Phone)లో కెమెరా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎ చిన్న సమయం, సందర్భం వచ్చినా తమ చేతిలో ఉన్న ఫోన్ తో వెంటనే క్లిక్ మనిపించి ఫోటో తీస్తున్నారు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న పెద్ద , ఆడమగ అనే తేడా లేకుండా అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకనే స్మార్ట్​ఫోన్​లోని కెమెరాకు ప్రాధాన్యత పెరిగింది. మిగతా అన్ని ఫీచర్లను పక్కనపెట్టి మరీ కెమెరా క్వాలిటీని చూసి ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. అలా రొజూ తీసుకునే సెల్ఫీ సరదా ఓ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థికి అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్ గుర్తింపు తేవడమే కాదు.. ఏకంగా కోట్లు సంపాదించి పెడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఇండోనేసియాలోని సెమరాంగ్‌ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘొజాలి(22) కు రోజూ సెల్ఫీ ని తీసుకునే అలవాటు. అయితే ఇలా సెల్ఫీ ని ఒకటే తీసుకుంటాడు. అదీ తన కంప్యుటర్ ముందు కూర్చుని.. రోజూ ఒకటే సెల్ఫీ తీసుకుంటాడు. ఇలా గత ఐదేళ్లుగా సెల్ఫీని తీసుకుంటూనే ఉన్నాడు. ఇలా తీసుకున్న సెల్ఫీలతో గ్రాడ్యుయేషన్‌ చదువుకుంటున్న సమయంలో తనలో వచ్చిన మార్పులు అంటూ ఓ టైమ్‌లాప్స్‌ వీడియో చేయడానికి రెడీ అయ్యాడు.

అయితే ఇంతలో సుల్తాన్‌ గుస్తాఫ్‌ దృష్టిలో ‘నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌’ వార్తలపై పడింది. వెంటనే ఎన్‌ఎఫ్‌టీలకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచాడు. ఎన్‌ఎఫ్‌టీ అంటే ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్‌ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు ఉపయోగించే ఒక ఆన్ లైన్ సాధనం. దీంతో సుల్తాన్ తన సెల్ఫీలను ‘ఘొజాలి ఎవిరీడే’ పేరుతో జనవరి 10వ తేదీన 933సెల్ఫీ లను అమ్మకానికి పెట్టాడు. ఒకొక్క సెల్పి ధర 3 డాలర్లని చెప్పాడు.సెల్ఫీని తాను కొన్నట్లు సెలబ్రిటీ షెఫ్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. వెంటనే సుల్తాన్‌ గుస్తాఫ్‌సెల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం 11 రోజులల్లో అంటే జనవరి 21వ తేదీకి 500 మందికిపైగా సులాన్ట్ సెల్ఫీలను కొన్నారు. దీంతో సుల్తాన్ 384 ఎథెర్‌ కాయిన్స్‌ ను సంపాదించాడు. ఎథెర్‌ అంటే.. బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీ. 384 ఎథెర్‌ల విలువ భారత దేశ కరెన్సీ లో దాదాపు రూ.7.5 కోట్ల అన్నమాట. దీంతో ఆశ యువకుడి సెల్ఫి సరదా ఎకంగా కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుడిని చేసింది.

Also Read:  కచా బాదమ్ సాంగ్ కు కొరియన్ తల్లి కూతురు ఫిదా.. డ్యాన్స్ వీడియో వైరల్..