Blast in Congo: క్రిస్మస్ సంబరాల్లో విషాదం.. రెస్టారెంట్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..

|

Dec 26, 2021 | 11:28 AM

Blast in Congo: క్రిస్మస్ పండుగ వేళ.. ఆఫ్రికాలో కాంగోలోని కొందరు విధ్వసం సృష్టించారు.  క్రిస్మస్ సందర్భంగా కాంగోలోని ఒక రెస్టారెంట్ బార్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో..

Blast in Congo: క్రిస్మస్ సంబరాల్లో విషాదం.. రెస్టారెంట్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..
Congo Blast
Follow us on

Blast in Congo: క్రిస్మస్ పండుగ వేళ.. ఆఫ్రికాలో కాంగోలోని కొందరు విధ్వసం సృష్టించారు.  క్రిస్మస్ సందర్భంగా కాంగోలోని ఒక రెస్టారెంట్ బార్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. బాంబు పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో భారీ కాల్పులు జరిగాయి. భయాందోళనకు గురైన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వీధుల్లోకి పరుగులు తీశారు.  ఈ ఘటనపై నార్త్ కివు గవర్నర్ ప్రతినిధి జిన్ సిల్వైన్ మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉండే బార్‌లోకి నిందితుడు ప్రవేశించకుండా భద్రతా దళాలు అడ్డుకున్నారు. దీంతో బార్ ఎంట్రన్స్ దగ్గర అతను దాడి చేయడమే కాదు.. తనని తాను పేల్చేసుకున్నాడని చెప్పారు. అంతేకాదు ‘సెలవు రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సాధ్యమైనంత వరకూ రద్దీ ప్రాంతాలకు కొంతకాలం వరకూ వెళ్లకుండా ఉండాలని  ప్రజలను అభ్యర్ధించారు.

అయితే శనివారం నాడు జరిగిన దాడికి అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) కారణమని అధికారులు వెల్లడించారు.   ఈ ప్రాంతంలోని అత్యంత ఘోరమైన సాయుధ దళాలను కలిగిన సంస్థల్లో ఎడిఎఫ్ ఒకటని అన్నారు.

ప్రత్యక్ష సాక్షి

ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షి రాచెల్ మగాలి స్పందిస్తూ.. తనకు  బయట పెద్ద చప్పుడు వినిపించిందని.. అప్పుడు సంఘటన స్థలంలోనే తాను మూడు గంటల పాటు తన బంధువుతో ఉన్నానని చెప్పారు.  అకస్మాత్తుగా బార్ ని నల్లటి పొగ కమ్మేసింది. అప్పుడే జనం కేకలు వేయడం.. రోదనలు వినిపించాయి. అంటే తాము అక్కడికి వెంటనే వెళ్లారు..  అక్కడ ప్రజలు నేలమీద పడి ఉన్నారు. అక్కడక్కడా పచ్చని ప్లాస్టిక్ కుర్చీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చాలా శరీరాల తలలు, చేతులు మొండెం దూరంగా పడి ఉన్నాయి. బార్ దగ్గర ప్రాంతం అంతా చాలా భయానకంగా కనిపించింది అని చెప్పారు.

మృతుల్లో చిన్నారులు : 
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఆ మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని మేయర్ నర్సిస్ తెలిపారు.  13 మంది గాయపడ్డారని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభిచినట్లు తెలిపార్టు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని చెప్పారు.

Also Read: శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి.. అచ్చతెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ

ఫన్నీగా ఉండడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. కాదనేందుకు లేదు.. మద్రాస్ హైకోర్టు తీర్పు

డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..