Sudan violence: సూడాన్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. 56కి పెరిగిన మరణాల సంఖ్య..

|

Apr 07, 2021 | 7:18 AM

Sudan's West Darfur clashes: సూడాన్‌లో మళ్లీ హింస చెలరేగుతోంది. సూడాన్‌లోని డార్ఫూర్‌లో రెండు తెగల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో

Sudan violence: సూడాన్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. 56కి పెరిగిన మరణాల సంఖ్య..
Sudan's West Darfur Clashes
Follow us on

Sudan’s West Darfur clashes: సూడాన్‌లో మళ్లీ హింస చెలరేగుతోంది. సూడాన్‌లోని డార్ఫూర్‌లో రెండు తెగల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 56 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) వెల్లడించింది. దీంతోపాటు 132 మందికి గాయపడ్డారని పేర్కొంది. పశ్చిమ డర్ఫూర్‌ ప్రావిన్స్‌లోని జెనీనాలో తాజాగా మసాలిట్‌, అరబ్ అనే రెండు గిరిజన తెగలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ దారుణం చోటుచేసుకుందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తంచేసింది. అయితే.. గతేడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇంత పెద్ద స్థాయిలో హింసజరగడం ఇదేననని పేర్కొంది. తుపాకులు, గ్రెనెడ్లతో కాల్పులు జరుపుకుంటుండంతో మరణాల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.

హింస ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఘర్షణ అనంతరం పశ్చిమ డర్ఫూర్‌, ఎల్ జెనీవాలో అత్యవసర స్థితిని ప్రకటించారు. 2019 ఏప్రిల్‌లో ఒమర్ అల్-బషీర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుంచి సుడాన్‌లోని డార్ఫూర్ ఇతర ప్రాంతాలలో హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బషీర్‌తో పోరాడిన కొన్ని తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ హింస పెరుగుతుండటంతో ప్రజలు భయంతో వేరే ప్రాంతాలకు పయనమవుతున్నారు.

Also Read:

Maoist letter: జవాన్‌ను విడిచిపెట్టేందుకు షరతులు.. లేఖ రాసిన మావోయిస్టులు..

Dubai Police: నగ్నంగా పోటోషూట్‌.. ఆన్‌లైన్‌లో వీడియో వైరల్.. దుబాయ్ పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..