మంటల్లో స్టంట్ మ్యాన్, మూడంతస్థుల నుంచి కిందికి దూకాడు, ఎక్కడంటే ?

| Edited By: Phani CH

Apr 27, 2021 | 1:08 PM

కొందరు చేసే ప్రాణాంతక స్టంట్లు  ఆశ్చర్యకరంగాను, భయంకరంగాను ఉంటాయి. తమ ప్రాణాలను కూడా   లెక్క చేయకుండా వారు చేసే సాహస కృత్యాలను చూసి షాక్ తినక తప్పదు.

మంటల్లో స్టంట్ మ్యాన్, మూడంతస్థుల నుంచి కిందికి దూకాడు, ఎక్కడంటే ?
Stuntman Is Engulfed In Flames Jumps From 3 Storey Building
Follow us on

కొందరు చేసే ప్రాణాంతక స్టంట్లు  ఆశ్చర్యకరంగాను, భయంకరంగాను ఉంటాయి. తమ ప్రాణాలను కూడా   లెక్క చేయకుండా వారు చేసే సాహస కృత్యాలను చూసి షాక్ తినక తప్పదు.  ఫ్రాన్స్ లో బ్రియాన్ విజియెర్  అనే  పాతికేళ్ల యువకుడు చేసిన స్టంట్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇతగాడు పెట్రోలుతో  తన శరీరమంతా మంటలు అంటించుకుని మూడంతస్థుల భవనం నుంచి కింది దూకాడు.  కింద ఇతని సహచరులు ఓ పెద్ద ఎయిర్ బ్యాగ్ పట్టుకోగా దానిపైకి జంప్ చేశాడు. బ్రియాన్ చేసే స్టంట్లు నెట్ ఫ్లిక్స్ సిరీస్… ‘ల్యుపిన్’ లో ప్రసారమవుతుంటాయట.

హ్యూమన్ టార్చ్ , హైఫాల్ అనే  రెండు  రకాల సాహస కృత్యాలను కలిపి ఇతగాడు ఈ ‘మంటల దూకుడుకు’ పాల్పడుతుంటాడు. తన శరీరం ఏ మాత్రం కాలకుండా , గాయపడకుండా బ్రియాన్ చేసే ఈ విధమైన అద్భుత స్టంట్లను చూసేందుకు జనం ఎగబడుతుంటారు.  ఫ్రాన్స్ లో ఈయన  పెద్ద పేరున్న స్టంట్ మ్యాన్ .. తన చిన్నతనం నుంచే తనకు ఇలాంటివి చేయడమంటే సరదా అని, ఇష్టమని బ్రియాన్ చెబుతున్నాడు. కానీ ప్రమాదకరమైన ఈ విధమైన పనులు వద్దని ఇతని పేరెంట్స్, స్నేహితులు చెబుతున్నా బ్రియాన్ మాత్రం వినిపించుకోవడం లేదు. ఇతని సాహస వీడియోలు దేశంలో పాపులర్ అవుతున్నాయి. ముందు ముందు ఇంకా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తానని నిర్భయంగా చెబుతున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: TRS Formation Day: రాష్ట్రంలో నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుక‌లు.. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే

మే 2 న విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం,