Strong Earthquake: దక్షిణ అమెరికా ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 15 మంది మృతి, కూలిన అందమైన భవనాలు..

|

Mar 19, 2023 | 10:32 AM

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూ ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఉపధ్రవంతో 15 మంది చనిపోయినట్లు సమాచారం.

Strong Earthquake: దక్షిణ అమెరికా ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 15 మంది మృతి, కూలిన అందమైన భవనాలు..
Earthquake
Follow us on

ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఉపధ్రవంతో 15 మంది చనిపోయినట్లు సమాచారం.
భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఒకవేళ ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. ప్రభావం మరింత తీవ్రంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేసింది. భూకంపం దాటికి స్థానిక గ్వాయాస్ ప్రాంతంలో కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. మరకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. క్యూయెంకాలో ఓ భవనం… కారుపై కుప్పకూలడంతో ఒకరు, శాంటా రోసాలో మరో ముగ్గురు చనిపోయారు.

శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు ఈక్వెడార్‌ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయ్‌. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అయితే, భూకంపసమయంలో ప్రజలు భయాందోళనకు గురైన వీడియోలు .. ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

భూకంపంలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. భూకంపం కారణంగా దక్షిణ ఈక్వెడార్‌లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయి. సునామీ వచ్చే సూచనలు లేవు. ఉత్తర పెరూలో కూడా భూకంపం సంభవించింది మరియు ప్రస్తుతం పెద్ద నష్టం లేదా ప్రమాదం లేదు.

ఈక్వెడార్ తరచుగా భూకంపాలకు గురవుతుంది. 2016లో, దేశంలో అత్యంత తక్కువ జనాభా కలిగిన పసిఫిక్ తీరానికి ఉత్తరాన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 600 మందికి పైగా మరణించారు. ఇటీవల, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు నివేదించబడ్డాయి. టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో 40,000 మందికి పైగా మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం