పాము తన గుడ్లను తానే మింగేస్తుందంటారు.. ! కానీ, ఇక్కడ ఓ పాము తన తోకను తానే మింగేసింది. నమ్మలేక పోతున్నారా..? కానీ, అది నిజం.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాములు అధికంగా తిరిగే అటవీప్రాంతంలో ఆ విజువల్స్ కెమెరాకు చిక్కాయి.
స్నేక్ ఎక్స్ పర్ట్ అయిన జీస్సే రోథాకర్ కళ్లేదురుగానే ఆ పాము తన తోకను మింగేయటం చూసి అడ్డుకున్నాడు. పాము తలపై నెమ్మదిగా నిమురుతూ అది తన తోకను విడిచిపెట్టేలా చేశాడు. కొంత సమయం తర్వాత పాము నెమ్మదిగా తన నోట్లో నుంచి తోకను బయటకు తీసింది. అయితే, సాధారణంగా పాములు వేరే జీవులను తినే అలవాటులో ఈ తోక కూడా మరో జీవిదనే తనకు తెలియకుండానే మింగేసిందని చెప్పుకొచ్చారు స్నేక్ ఎక్స్ పర్ట్స్. ఏదేమైనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.