Sri Lanka Crisis: ప్రాణాలు తీస్తున్న ఇంధన సంక్షోభం.. ఐదు రోజులపాటు క్యూలో నిరీక్షణ.. చివరకు ట్రక్ డ్రైవర్..

|

Jun 24, 2022 | 6:05 AM

విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక సర్కారు దగ్గర తగినంత మారక ద్రవ్యం లేదు.. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.

Sri Lanka Crisis: ప్రాణాలు తీస్తున్న ఇంధన సంక్షోభం.. ఐదు రోజులపాటు క్యూలో నిరీక్షణ.. చివరకు ట్రక్ డ్రైవర్..
Sri Lanka Crisis
Follow us on

Sri Lanka Truck Driver Dies: శ్రీలంక ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆర్ధిక మాద్యంలో నిండా కూరుకుపోయిన శ్రీలంకను ప్రధానంగా ఇంధన సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక సర్కారు దగ్గర తగినంత మారక ద్రవ్యం లేదు.. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో తెలియని ఇంధనం కోసం అక్కడి జనం బంకుల దగ్గర క్యూ కడుతున్నారు..కిలో మీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. పెట్రోల్‌ బంకుల ముందు ఇలా గంటలు, రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. గంటలైతే ఓపిక పట్టవచ్చు. కానీ రోజుల తరబడి ఎదురు చూడటమంటే శారీరకంగా వత్తిడి పెరుగుతుంది. క్యూలైన్లలో ఇంధనం కోసం నిరీక్షిస్తున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య 10కి చేరింది.

తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఐదు రోజుల పాటు క్యూలైన్లో ఎదురు చూసి గుండెపోటుతో మరణించడం అందరినీ కలవరపెట్టింది. అంగూరువాతోటలోని ఫిల్లింగ్ స్టేషన్ వద్ద క్యూలో వేచి ఉన్న తర్వాత వ్యక్తి తన వాహనంలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. రోజులతరబడి ఇంధనం కోసం బంకు దగ్గర ఎదురు చూస్తున్నవారిలో ఎక్కువగా సామాన్య ప్రజలే ఉంటున్నారు. వీరంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కొలంబోలోని పానదురాలోని ఇంధన స్టేషన్‌లో 53 ఏళ్ల వ్యక్తి క్యూలో నిరీక్షిస్తూ మరణించాడు.

మరోవైపు ఇంధన కొరతతో రవాణా సౌకర్యం తగ్గిపోయి ప్రయాణాలు నిలిచిపోతున్నాయి. బస్సులు, కార్లు, ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలు కూడా తిరగలేకపోతున్నాయి ఈ సమస్యను అధిగమించడం ఎలాగో తెలియక శ్రీలంక ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవులిస్తోంది. దీంతో సామాన్య ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..