Gotabaya Rajapaksa: మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.. ఈ రోజు రాజీనామా చేసే ఛాన్స్..

|

Jul 13, 2022 | 8:19 AM

దేశం విడిచి పారిపోవాలని రాజపక్స చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాల్దీవుల రాజధాని మాలేలో అడుగుపెట్టినట్లు విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి.

Gotabaya Rajapaksa: మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.. ఈ రోజు రాజీనామా చేసే ఛాన్స్..
Gotabaya Rajapaksa
Follow us on

Gotabaya Rajapaksa flees to Maldives: శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన రాజపక్స కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంది. అయిదు రోజుల క్రితం అధ్యక్ష భవనం వదిలి పారిపోయిన గొటబయ రాజపక్స, బుధవారం రిజైన్‌ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖపై ఆయన సంతకం చేసినట్టు చెబుతున్నారు. అయితే దేశం విడిచి పారిపోవాలని రాజపక్స చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాల్దీవుల రాజధాని మాలేలో అడుగుపెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైనట్లు వైమానిక అధికారి తెలిపారు. మాల్దీవుల్లోని వెలనా విమానాశ్రయంలో రాజపక్సేకు.. ప్రభుత్వ ప్రతినిధి స్వాగతించినట్లు తెలుస్తోంది. రాజపక్సే కుటుంబంపై పెరుగుతున్న జనాగ్రహంతో సోమవారం రాత్రి, రాజపక్సే, అతని సోదరుడు, శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి దేశం విడిచి వెళ్లేందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే.. వారంపాటు అజ్ఞాతంలో ఉన్న గొటబయ పక్సేకు స్టాంపింగ్‌ చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నో చెప్పడంతో ఆయన పలాయనం సాధ్యం కాలేదు.

గొటబయ రాజపక్స, ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స కూడా దుబాయ్‌ పారిపోవడానికి ట్రై చేశారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను స్టాఫ్‌ అడ్డుకున్నారు. బసిల్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. దుబాయ్‌ మీదుగా అమెరికా వెళ్లేందుకు బసిల్‌ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాజకపక్స సోదరులు ఎవరూ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించాలని కోరుతూ శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గొటబయ రాజపక్స రాజీనామా చేస్తానని ప్రకటించడంతో అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు సుజిత్‌ ప్రేమదాస. ఎస్‌జేబీ పార్టీ అధ్యక్షుడైన ప్రేమదాస ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నెల 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. మరోవైపు, శ్రీలంక అధ్యక్ష భవనం నిరసనకారులకు అడ్డాగా మారింది.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..