మనసులో మెదిలే భావాలను కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత (Poetry). సమస్త మానవాళి అంగీకరించిన గొప్ప పద్ధతుల్లో కవిత్వం ఒకటి. కవిత్వం బోధనను ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా రచన సృష్టి, ప్రచురణ, పఠనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవంగా (World Poetry Day) జరుపుకుంటున్నారు. సరిహద్దులు, సాంస్కృతిక భేదాలను అనుసంధానించడానికి కవిత్వం ఒక గొప్ప సాధనం. అంతరించిపోతున్న భాషలు, అందులోని పదాలను వెలికితీసి వాటిని భవిష్యత్ తరానికి సురక్షితంగా అందించేదే కవిత. ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (UNESCO) నిర్వహిస్తోంది. భాషా భిన్నత్వాల్ని, కవితా ప్రచారం ద్వారా ఏకం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడటం కూడా ఈ దినోత్సవ ఏర్పాటు ఉద్దేశ్యం.
1999 లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన యునెస్కో30 వ సదస్సులో మార్చి 21వ తేదీని, ప్రపంచ కవితా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు. అప్పటినుంచి మార్చి 21ను యునెస్కో ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కవితా రచన, పఠనం, ప్రచురణ, బోధనా నైపుణ్యాలను చైతన్యవంతం చేయడం, జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ కవిత్వ ఉద్యమాల స్ఫూర్తిని కాపాడుకోవడం ఈ దినోత్సవం మఖ్య లక్ష్యాలు. అంతే కాకుండా కవితా ప్రచారం ద్వారా భాషా భిన్నత్వానికి చేయూతనిచ్చేలా చర్యలు తీసుకోవచ్చు. అంతరించిపోతున్న భాషలకు తోడ్పాటు అందించి వాటని కాపాడవచ్చు. రంగస్థలం, నృత్యం సంగీతం, చిత్రకళలతో కవిత్వానికి కొత్త కళ తీసుకురావచ్చు. చిన్న ప్రచురణకర్తలకు చేయూతనిచ్చి, ప్రసారమాధ్యమాల్లో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించవచ్చు. ఈ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఏటా ప్రపంచ కవితా దినోత్సవం జరుపుకుంటారు.
Also Read
Clouds: కొన్ని మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయి..? కారణాలు తెలుసుకోండి..!
Child Care: పిల్లలకు ఈ ఫుడ్ తినిపిస్తే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. అవేంటంటే..!
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రంగలోకి దిగనున్న ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు