
South Korea Population Falls: ప్రపంచంలో సగం పైగా దేశాల్లో శిశు జననాలు భారీగా తగ్గాయని.. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ లో తాతబామ్మలే తప్ప..మనవలు, మనవరాళ్లు ఉండరని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా పశ్చిమాసియా దేశమైన దక్షిణ కొరియాలో జననాల కంటే.. మరణాలే అధికంగా సంభవించాయి. ముఖ్యంగా 2020 లో ఈ జనన మరణ రేటులో మరీ తేడా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది అక్కడి ప్రభుత్వం.
ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉన్న దేశంగా దక్షిణకొరియా నిలిచింది. ఐతే తాజా గణాంకాల్లో గత ఏడాది 2,75,800మంది జన్మించగా.. 3,07,764 మంది మరణించారు. ఇక గత ఏడాది జననాల సంఖ్యా 2019 కంటే పది శాతం కంటే తక్కువని ఆ దేశ హోంశాఖ వెల్లడించింది. ఆ దేశంలో రాజు రోజుకీ యువత తగ్గడం.. వృద్ధుల రేటు పెరగడంతో ఆర్ధిక విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. వృద్ధులకు ఆరోగ్య సేవలను అందించడం కోసం.. పెన్షన్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది దేశంపై తీవ్ర ఒత్తిడి కలుగజేస్తుంది. మరో వైపు కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోతుండడంతో.. పారిశ్రామిక ప్రగతికిఅడ్డుకట్ట పడుతుంది. ఈ రెండు అంశాలు ఆ దేశ ఆర్ధిక స్థితిపై పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై అక్కడి అధికారులు స్పందిస్తూ.. ప్రస్తుత గణాంకాలు దృష్టిలో పెట్టుకుని తమ విధానాలపై ప్రాధమిక మార్పులపై దృష్టిపెడతామని చెప్పారు. అంతేకాదు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయ్ జననాల రేటును పెంచడానికి కొత్త పథకాలను ప్రారంభించారు. పిల్లలు పుట్టే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నది అక్కడి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 2022లో పుట్టే ప్రతి బిడ్డకూ తల్లిదండ్రులకు మన దేశ కరెన్సీ లో రూ.1,35,000 ఇవ్వనున్నారు. అంతేకాదు.. ఆ పిల్లవాడి పోషణ నిమిత్తం ఒక సంవత్సరం వచ్చే వరకూ ప్రతినెలా రూ. 20 వేలు చెల్లించనున్నారు. ఈ పథకం ద్వారా అందించే మొత్తం 2025 నుంచి మరింత పెంచనున్నామని ఆ దేశ అధికారులు తెలిపారు.
Also Read: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తాను వ్యతిరేకం.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయిందన్న…