Temple Collapses: కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!

South Africa temple collapses: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లోని నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల ఆలయం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితో సహా మరో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తుంది.

Temple Collapses: కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
South Africa Temple Collapses

Updated on: Dec 14, 2025 | 10:16 AM

దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లోని కొత్తగా నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల అహోబిలం ఆలయంలో కార్మికులు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితో సహా మరో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు కార్మికులు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గాయపడిన వారికి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.