టెస్లా సీఈఓ ఎలన్ మస్క్(Elon musk).. సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్ (Twitter) ను కొనుగోలు చేసేందుకు ఆయన చేసిన ఆఫర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో(Social Media) రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయనపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ – కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సీఈఓ సైతం మస్క్‌పై జోకులు వేశారు. ట్విటర్‌కు బదులుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను కొనాలని సూచించారు. ఈ కామెంట్.. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. దీనికి నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. సిలాన్ అనేది శ్రీలంక దేశానికున్న మరో పేరు. కునాల్‌తో పాలు పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ చేసిన ఆఫర్ 43 బిలియన్ డాలర్లు. శ్రీలంక అప్పులు 45 బిలియన్ డాలర్లు. అలాంటప్పుడు మస్క్ ఆ దేశాన్ని కొనొచ్చు. తన పేరును కూడా సిలాన్ మస్క్ అని పెట్టుకోవచ్చు’ అని జోక్ వేశారు.
Elon Musk’s Twitter bid – $43 billion
Sri Lanka’s debt – $45 billion
He can buy it and call himself Ceylon Musk ?H/t Whatsapp
— Kunal Bahl (@1kunalbahl) April 14, 2022
Also Read
IPL 2022: ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!
IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!