Shocking Video: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన.. కొండచరియలు విరిగిపడి 10 మంది దుర్మరణం

|

Jan 10, 2022 | 11:46 AM

Brazil Boats Accident: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు.

Shocking Video: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన.. కొండచరియలు విరిగిపడి 10 మంది దుర్మరణం
Brazil Boat Accident
Follow us on

Brazil Furnas Lake Incident: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. శనివారంనాడు అక్కడి అక్కడి ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో సరస్సులో షికారు చేస్తూ సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా పర్వతంలోని కొంత భాగం విరిగి రెండు బోట్లపై పడింది. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ షాకింగ్ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురు కన్నుమూయడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. జలపాతంలో మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారి కోసం రెస్క్కూ టీమ్స్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సమీపంలోని పర్యాటకులు తమ కెమరాల్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన విజువల్స్..

 

Also Read..

ఆ దేశంలో ఒక్క దోమ కూడా కనిపించదు.. దానికి సైన్స్ కారణమేంటో తెలుసుకోండి..

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌… రేపటి నుంచి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రాకపోకలు షురూ