మా ఇంట్లో దెయ్యం ఉంది..కావాలంటే మీరే చూడండి

మా ఇంట్లో దెయ్యం ఉంది..కావాలంటే మీరే చూడండి

చాలా కాలంగా ఆ ఇంట్లో ఏదో అలజడి..అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నాక ఎవరో ఆ ఇంట్లో శబ్దాలు చేస్తూ..అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతకీ ఎంటా శబ్ధాలు..? అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు. అది కూడా ఆ ఇంటి యజమానికి కూడా కనిపించకుండా ఎందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు..? ఎందుకంటే అక్కడ తిరిగేవి దెయ్యాలట..!అమ్మో దెయ్యాల..అవును దెయ్యాలే..ఓ దెయ్యం పిల్లాడు, తన చిన్ని కుక్కపిల్లతో ఆ ఇంట్లోనే గత కొంతకాలంగా ఆడుకుంటున్నాడట. రాత్రిపూట ఇంట్లో వస్తున్న శబ్దాలు ఎంటో […]

Pardhasaradhi Peri

|

Aug 23, 2019 | 5:04 PM

చాలా కాలంగా ఆ ఇంట్లో ఏదో అలజడి..అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నాక ఎవరో ఆ ఇంట్లో శబ్దాలు చేస్తూ..అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతకీ ఎంటా శబ్ధాలు..? అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు. అది కూడా ఆ ఇంటి యజమానికి కూడా కనిపించకుండా ఎందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు..? ఎందుకంటే అక్కడ తిరిగేవి దెయ్యాలట..!అమ్మో దెయ్యాల..అవును దెయ్యాలే..ఓ దెయ్యం పిల్లాడు, తన చిన్ని కుక్కపిల్లతో ఆ ఇంట్లోనే గత కొంతకాలంగా ఆడుకుంటున్నాడట. రాత్రిపూట ఇంట్లో వస్తున్న శబ్దాలు ఎంటో తెలుసుకోవాలనే ఆరాటంతో ఇంటి యజమాని ఇళ్లంతా సీసీకెమెరాలు ఏర్పాటు చేశాడు. దీంతో రాత్రిపూట అక్కడ జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఆ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని లాంగ్‌ ఐలాండ్‌లో చోటుచేసుకుంది. లాంగ్‌ ఐలాండ్‌కు చెందిన జోయ్‌నోలాన్‌ అనే వ్యక్తి తన ఇంట్లో తిరుగుతున్న దెయ్యం విజువల్స్‌ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ దెయ్యం పిల్లాడు, వాడి కుక్కపిల్ల ఏం చేస్తుందో మీరు చూడండి..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu