Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం పీక్స్ స్టేజ్‌లో ఉంది. రెండు దేశాలూ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా ఆ దేశంలోని వివిధ నగరాలపై రష్యా దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. అయితే, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజల్లో మాతృదేశంపై ప్రేమ పెరిగింది. ప్రజల్లో దేశ భక్తి ఉప్పొంగుతోంది. రష్యాపై ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంపై తమకున్న ప్రేమను పచ్చబొట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఉక్రెయిన్ జెండా, ఇతర దేశభక్తి చిహ్నాలను ప్రజలు టాటూలు వేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ వ్యాప్తంగా టాటూలు, బిల్‌బోర్డులు ట్రెండింగ్‌గా మారాయి.
ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల ఒలేనా బార్లెవిచ్.. ఇటీవల మిలటరీ విమానంతో కూడిన ఉక్రెయిన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఆటూ టాటూ వేయించుకుంది. ఇది తన దేశాన్ని రక్షించుకునేందుకు సైనికుల్లో ప్రేరణ కల్పించేందుకు, తమ దేశం పట్ల తమకున్న ప్రేమ, అభిమానానికి ఈ టాటూ చిహ్నం అని పేర్కొంది యువతి. ‘ఈ పచ్చబొట్టులో చాలా అర్థం ఉంది. ప్రస్తుతం దేశానికి కీలక సమయం. ఇది చరిత్రలో నిలిచిపోవాలి. భవిష్యత్ తరాలకు దేశభక్తి అందించబడాలి.’’ అని బార్లెవిచ్ పేర్కొంది. ఈమే కాదు.. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఇప్పుడు ఈ టాటూలు, బిల్ బోర్డులు ట్రెండీగా నిలిచాయి. టాటూల కోసం ఉక్రెయిన్ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని, టాటూలు వేసే వారు చెబుతున్నారు. ఇక ఎల్వివ్‌లోని ప్రింట్ షాపు మేనేజర్ యూరి కోబ్రిన్ ఉక్రెయినియన్ దళాలకు మద్ధతుగా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం కోసం ప్రేరణాత్మకమైన సందేశాలను టాటూలుగా, బిల్‌బోర్డ్ ప్రకటనలలో ఇస్తున్నారు. దేశం కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సైన్యానికి ప్రేరణ కల్పించేందుకే ఈ ప్రయత్నం అని ఆదేశ ప్రజలు చెబుతున్నారు. నిజంగా ఉక్రెయిన్ ప్రజల దేశ భక్తికి యావత్ ప్రపంచం దాసోహం అవుతోంది.
Also read:
AIIMS Gorakhpur 2022: నెలకు రూ. 67 వేల జీతంతో ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ జాబ్స్..