University Shooting: యూనివర్సిటీలో కాల్పులు.. 8 మంది మృతి.. మరి కొందరికి తీవ్ర గాయాలు..!

|

Sep 20, 2021 | 2:38 PM

University Shooting:  రష్యాలో పార్లమెంట్‌ ఎన్నికల వేళ కాల్పుల మోత మోగింది. ఆ దేశానికి చెందిన పెర్మ్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందగా, ఆరుగురు..

University Shooting: యూనివర్సిటీలో కాల్పులు.. 8 మంది మృతి.. మరి కొందరికి తీవ్ర గాయాలు..!
Follow us on

University Shooting:  రష్యాలో పార్లమెంట్‌ ఎన్నికల వేళ కాల్పుల మోత మోగింది. ఆ దేశానికి చెందిన పెర్మ్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన ఓ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. ఓ భవనం నుంచి అనేక మంది విద్యార్థులు భయంలో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీలైతే క్యాంప్‌ను వ‌దిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాల‌ని ఈ రోజు ఉదయం యూనివ‌ర్సిటీ ఓ అల‌ర్ట్ ఇచ్చింది. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు . భయంతో కొందరు విద్యార్థులు పరుగులు తీస్తుండగా, మరి కొందరు భవనంలోనే ఉండిపోయారు. కొందరు భవనం  పైనుంచి దూకి పారిపోయారు. కాగా, యూనివ‌ర్సిటీ విద్యార్ధే కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 18 ఏళ్ల తైముర్ బెక్మాన్సువ‌ర్‌గా గుర్తించారు. త‌న ప్లాన్ గురించి అత‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు జ‌రిపిన ఫైరింగ్‌లో అత‌ను గాయ‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఈ కాల్పులు ఎందుకు జరిగాయి..? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. రంగంలోకి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

 

ఇవీ కూడా చదవండి:

Afghan Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్‌

Train Horn Sound: అక్కడ రైలు హరన్‌ సౌండ్‌ బదులు.. కుక్కల అరుపులు.. కారణం ఏంటంటే..

H 1B Visa: లాటరీ ద్వారానే H1B వీసాలు.. భారతీయులకు భారీ ఊరట.. అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు..!