Russia Ukraine War Highlights: రష్యా దాడిలో 8 మంది పౌరులు మృతి.. రహస్య ప్రాంతానికి పుతిన్ కుటుంబం

| Edited By: Ravi Kiran

Mar 01, 2022 | 10:07 PM

Russia Ukraine Crisis: రణ రంగంలో కీలక మలుపు తీసుకోబోతోంది. చర్చలు ఫలించలేదు. అయితే ఇప్పుడు నాటో, ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఇచ్చాయి.  ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన

Russia Ukraine War Highlights: రష్యా దాడిలో 8 మంది పౌరులు మృతి.. రహస్య ప్రాంతానికి పుతిన్ కుటుంబం
Attack On Ukraine

Russia Ukraine Conflict Highlights: రణ రంగంలో కీలక మలుపు తీసుకోబోతోంది. చర్చలు ఫలించలేదు. అయితే ఇప్పుడు నాటో, ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఇచ్చాయి.  ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. తన పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడి కొనసాగిస్తోంది. మరోవైపు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు కొనసాగాలని నిర్ణయించారు.. అంతే కాకుండా మరో అంగీకారం కుదరలేదు. చర్చలు ముగిసిన వెంటనే కైవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఇదిలావుంటే.. కాగా, సోమవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై తీవ్రంగా చర్చ జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కూడా కొద్దిసేపు మౌనం పాటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశంలో యుద్ధాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పేర్కొంది. దౌత్య పద్ధతిలో చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యకు శాంతియే పరిష్కారమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

ఇదిలావుంటే.. ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా షాకింగ్ కామెంట్స్ చేశాడు. యుద్ధంలో ఐదవ రోజున రష్యా నిషేధిత థర్మోబారిక్ ఆయుధాన్ని ఉక్రెయిన్‌పై ఉపయోగించిందంటూ ఆరోపించారు. జెనీవా కన్వెన్షన్ ప్రకారం నిషేధించబడిన వాక్యూమ్ బాంబును రష్యా సోమవారం ఉపయోగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. థర్మోబారిక్ ఆయుధాలు సంప్రదాయ పేలుడు జరగదు. ఇది అధిక పీడన పేలుడు పదార్థంతో నింపబడి ఉంటాయి. ఇవి శక్తివంతమైన పేలుళ్లను ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల వాతావరణం నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి.

ఇక ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఇరుకున పెట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు మరిన్ని ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాకు చెందిన మరో 26 మందిపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది. వారిలో ఒలిగార్క్‌లు, సీనియర్ అధికారులు, పలు బీమా సంస్థలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 680 మంది లక్ష్యంగా ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Mar 2022 10:06 PM (IST)

    రహస్య ప్రాంతానికి పుతిన్ కుటుంబం..

    ఉక్రెయిన్ పై రష్యా తన దాడులు మరింతగా పెంచుతూపోతోంది. ఈ నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండే సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్ ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

  • 01 Mar 2022 10:06 PM (IST)

    రష్యా దాడిలో 8 మంది పౌరులు మృతి..

    ఉక్రెయిన్ పై రష్యా తన యుద్దాన్ని ఏమాత్రం ఆపడం లేదు. ఖర్కివ్ లోని ఇళ్ళపై రష్యా వైమానిక దాడులు చేయగా.. 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.


  • 01 Mar 2022 08:34 PM (IST)

    భారతీయ విద్యార్థులతో వీకే సింగ్ భేటీ..

    పోలాండ్‌ దేశంలోని వార్సాలో గురుద్వారా శ్రీ గురుసింగ్ సభలో నివసిస్తున్న 80 మంది భారతీయ విద్యార్థులతో కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ కలిశారు.

  • 01 Mar 2022 08:32 PM (IST)

    రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య రెండో దఫా చర్చలు జరగనున్నాయి

    యుద్ధానికి ముగింపు పలికేందుకై రష్యా – ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండోదశ చర్చలు జరుగనున్నాయి. బుధవారం నాడు రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చలు జరుపనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో కథనాలు వస్తున్నాయి.

  • 01 Mar 2022 07:01 PM (IST)

    యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ సభ్యత్వం పొందనుంది..

    రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందనుంది. ఉక్రెయిన్‌ను సభ్యదేశంగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. సభ్యత్వం కోసం ఉక్రెయిన్ చేసుకున్న దరఖాస్తును యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించింది.

  • 01 Mar 2022 06:57 PM (IST)

    చైనా సహాయం కోరిన ఉక్రెయిన్.. ఆన్సర్ ఏం వచ్చిందంటే..

    రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ చైనా సహాయం కోరింది. దీనికి స్పందించిన చైనా.. దౌత్యం ద్వారానే ఈ విషయాన్ని తేల్చుకోవాలని బదులిచ్చింది.

  • 01 Mar 2022 06:22 PM (IST)

    రష్యాకు ధీటుగా జవాబిస్తున్నారు.. సైనికులను ప్రశంసించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు..

    రష్యాకు ధీటుగా ఉక్రెయిన్ బలగాలు పోరాడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. యూరోపియన్ యూనియన్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఈరోజు ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన రోజు అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాలు వెనక్కి తగ్గడం లేదన్నారు. రష్యాకు తమ సైనికులు తగిన సమాధానం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

  • 01 Mar 2022 06:07 PM (IST)

    రంగంలోకి బెలారస్ సైనికులు.. ఉక్రెయిన్‌పై దాడులు..

    ఉక్రెయిన్‌పై దాడులకు రష్యాకు తోడుగా బెలారస్ చేరింది. బెలారస్ దళాలు ఉక్రెయిన్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. మరోవైపు రష్యన్ బలగాలు రాజధాని కైవ్ వైపు దూకుడుగా కదులుతున్నాయి.

  • 01 Mar 2022 06:02 PM (IST)

    ఉక్రెయిన్‌లో హత్యకు గురైన విద్యార్థి తండ్రితో మాట్లాడిన ప్రధాని మోదీ..

    ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప తండ్రితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. నవీన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

  • 01 Mar 2022 04:24 PM (IST)

    ఖర్కివ్‌ నగరంలోని ప్రభుత్వ కార్యాలంపై రష్యా దాడి..

    తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ ప్రభుత్వ హెడ్‌క్వార్టర్స్‌పై రష్యా సేనలు వైమానిక దాడి జరిపాయి. అటు నివాస ప్రాంతాలపైనా జరిగిన దాడుల్లో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది.

  • 01 Mar 2022 04:10 PM (IST)

    ఉక్రెయిన్‌పై రష్యా ఆపరేషన్‌లో పాలుపంచుకునే యోచన లేదు: బెలారస్

    ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాతో జత కలిసే ఆలోచన తమకు లేదని బెలారస్ స్పష్టంచేసింది. రష్యా సేనలకు బెలారస్ సేనలు సహకరిస్తున్నట్లు ఉక్రెయిన్ పాలకులు ఆరోపిస్తున్నారు. బెలారస్ భూభాగం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పష్టంచేశారు. రష్యాతో కలిసి తాము ఉక్రెయిన్ సేవలపై దాడులు చేయడం లేదని స్పష్టంచేశారు.

  • 01 Mar 2022 04:01 PM (IST)

    అణ్వాయుధాలు ఉపసంహరించుకోండి.. అమెరికాను డిమాండ్ చేసిన రష్యా

    యూరఫ్‌ నుంచి అణ్వాయుధాలను అమెరికా ఉపసంహరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లవ్‌రోవ్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌పై తమ యుద్ధం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఆశించిన లక్ష్యం నెరవేరే వరకు తమ దాడులు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

  • 01 Mar 2022 03:56 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన..

    ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ధుల భద్రతపై విదేశాంగశాఖ తీవ్ర ఆందోళనలో ఉంది. భారత్‌లో రష్యా , ఉక్రెయిన్‌ రాయబారులతో ఈవిషయంపై చర్చించారు విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్‌ ష్రింగ్లా . ఖార్కీవ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల మీదుగా స్వదేశం చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 01 Mar 2022 03:55 PM (IST)

    నవీన్ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన కర్ణాటక సీఎం

    నవీన్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన తెలియగానే భారీ సంఖ్యలో గ్రామస్తులు నవీన్‌ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు. కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై కూడా నవీన్‌ కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు.

  • 01 Mar 2022 03:55 PM (IST)

    అప్పటి వరకు దాడులు కొనసాగిస్తాం.. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన

    గత ఆరు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. వందల సంఖ్యలో సైనికులు, అమాయ పౌరులు మృతి చెందుతున్నారు. యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాన్ని కోరుతున్నాయి. ఈ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో తమ నిర్ణయంలో మార్పు లేదని రష్యా స్పష్టంచేసింది. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు ఉక్రెయిన్‌పై తమ సేనల దాడులు కొనసాగుతాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • 01 Mar 2022 03:19 PM (IST)

    ఉక్రెయిన్‌లో భారత విద్యార్ధి మృతి..

    ఉక్రెయిన్‌లోని భార్కివ్‌లో రష్యన్ బలగాలు జరిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

  • 01 Mar 2022 02:46 PM (IST)

    రష్యాపై బహిష్కరణ వేటు..

    ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న రష్యాపై వరుసగా ఆంక్షల సెగ తగులుతోంది. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టగా.. ప్రస్తుతం క్రీడాలోకంలో కూడా రష్యా ఏకాకిగా మిగిలిపోనుంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై బహిష్కరణ వేటు వేసింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రష్యన్ జట్లను అనుమతించవద్దని ఐఓసీ ప్రకటించింది.

  • 01 Mar 2022 02:27 PM (IST)

    రొమేనియా నుండి ఢిల్లీకి మరో విమానం..

    ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులతో మరో విమానం రొమేనియా నుండి ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తిరిగి వచ్చిన వారిని స్వాగతించారు మరియు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ రక్షించడానికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తోందని వారికి హామీ ఇచ్చారు.

  • 01 Mar 2022 02:26 PM (IST)

    ఖార్కివ్ సెంట్రల్ స్క్వేర్‌ భవనంపై బాంబుల వర్షం.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలు..

    ఖార్కివ్ సెంట్రల్ స్క్వేర్‌లోని ప్రాంతీయ రాష్ట్ర పరిపాలనా భవనాన్ని రష్యా సైన్యం పేల్చివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ దాడిలో 1 చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.

  • 01 Mar 2022 02:22 PM (IST)

    ఫిబ్రవరి 24 నుంచే భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం

    ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్ల నుంచి సరిహద్దు ప్రాంతాలకు తరలిరావాలని భారతీయ విద్యార్థులకు సూచిస్తున్నారు ఇండియన్‌ ఎంబసీ అధికారులు. ఫిబ్రవరి 24 నుంచే భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు ఇండియన్‌ ఎంబసీ అధికారులు.

  • 01 Mar 2022 02:22 PM (IST)

    షెహ్ని బోర్డర్‌ దగ్గర భారతీయులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు

    కేంద్రమంత్రి వీకేసింగ్‌ దీని కోసం ప్రత్యేకంగా పోలాండ్‌ ప్రధానితో సంప్రదింపులు జరిపారు. ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌ బోర్డర్‌కు వస్తున్న భారతీయులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. షెహ్ని బోర్డర్‌ దగ్గర భారతీయులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు.

  • 01 Mar 2022 02:21 PM (IST)

    పోలాండ్‌ బోర్డర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఇండియన్‌ ఎంబసీ

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో అక్కడ ఉన్న భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ఇండియన్‌ ఎంబసీ. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను వదిలిపెట్టాలని కోరింది ఇండియన్‌ ఎంబసీ.

  • 01 Mar 2022 02:19 PM (IST)

    దూకుడు పెంచిన ఆసియా స్టాక్​ మార్కెట్లు

    ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు.. ఉక్రెయిన్​- రష్యా చర్చలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆసియా స్టాక్​ మార్కెట్లు చాలావరకు లాభాల్లో ఉన్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో టోక్యో, సిడ్నీ, షాంఘై సూచీలు పుంజుకున్నాయి. సోమవారం మన దేశీ మార్కెట్లుగా పుంజుకుంటాయిని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • 01 Mar 2022 02:18 PM (IST)

    ఉక్రెయిన్​కు ఇజ్రాయెల్ వైద్య సాయం

    రష్యా దాడులతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్​కు సాయం అందించనున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్​. వైద్య పరికరాలు, నీటిశుద్ధి యంత్రాలు, టెంట్లు, బ్లాంకెట్లు, కోట్లు వంటివి సరఫరా చేస్తున్నట్లు ఇజ్రాయెల్​ అధికారులు వెల్లడించారు. వీటిని విమానాల్లో పోలాండ్​కు తరలించి అక్కడి నుంచి ఉక్రెయిన్​కు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

  • 01 Mar 2022 02:15 PM (IST)

    రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న విద్యార్థులు..

    కైవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేయబడిన వెంటనే విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని కోరారు. ఎంబసీ అధికారులు అక్కడ ఉన్నారు.పెద్ద సంఖ్యలో విద్యార్థులు రైలులో ప్రయాణించగలరు.

  • 01 Mar 2022 01:43 PM (IST)

     గత 24 గంటల్లో దాదాపు లక్ష మంది పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దులకు..

    రష్యా సైనికుల నిరంతర దాడుల కారణంగా ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పారిపోతున్నారు. గత 24 గంటల్లో దాదాపు లక్ష మంది పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దులను విడిచిపెట్టినట్లు పోలాండ్ ప్రభుత్వం పేర్కొంది.

  • 01 Mar 2022 01:32 PM (IST)

    కైవ్, ఖిర్కివ్, చెర్నిహివ్‌ నగరాలపై రష్యా బాంబుల వర్షం..

    కైవ్, ఖిర్కివ్, చెర్నిహివ్‌లలో రష్యా బలగాలు ఫిరంగులతో దాడులను తీవ్రతరం చేశాయని బ్రిటన్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు కైవ్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు.

  • 01 Mar 2022 01:05 PM (IST)

    భారతీయులు కీవ్‌ను వెంటనే వదలిపెట్టండి..- ఇండియన్ రాయబార కార్యాలయం..

    భారతీయ విద్యార్థులు, పౌరులు వెంటనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను వీడాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. రైళ్లతోపాుట అందుబాటులో ఉన్న ఇతర రవాణ మార్గాల ద్వారా నగరం నుంచి బయటకు రావాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • 01 Mar 2022 12:52 PM (IST)

    కైవ్‌లోని ఉక్రేయిన్ సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసం

    ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మధ్య, రష్యా బాలిస్టిక్ క్షిపణి కైవ్‌లోని ఉక్రేనియన్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.

  • 01 Mar 2022 12:51 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను ప్రత్యేక విమానాల్లో..

    ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని వేగంగా జరుగుతుంది. వాస్తవానికి, ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని మరియు ఎక్కువ మంది ప్రజలను దేశానికి తిరిగి రప్పించాలని ప్రధాని మోదీ భారత వైమానిక దళాన్ని కోరారు. ఈ మిషన్‌లో వైమానిక దళంలో చేరిన తర్వాత, భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ వేగవంతం చేయబడుతుంది మరియు ఎక్కువ మందిని భారతదేశానికి తీసుకువస్తారు.

  • 01 Mar 2022 12:49 PM (IST)

    వేగంగా ఆపరేషన్ గంగ.. అంతర్జాతీయ పరిణామాలను రాష్ట్రపతికి వివరించిన ప్రధాని మోడీ..

    అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు వివరించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకొస్తున్న తీరును వివరించారు. ఇప్పటికే వెయ్యికిపైగా విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తీసుకురావడమే కాకుండా.. నలుగు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లిన సమచారాన్ని రాష్ట్రపతికి తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరూ సురక్షితంగా ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పని చేస్తుందని.. నిన్న ఉక్రెయిన్ సంక్షోభంపై అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

  • 01 Mar 2022 11:53 AM (IST)

    ఉక్రెయిన్‌కు క్షిపణులను అందించిన ఆస్ట్రేలియా

    ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఆస్ట్రేలియా కూడా ముందుకు వచ్చింది. ఇందులో క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపనున్నారు. ఆ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ఈ వివరాలను వెల్లడిచాడు. ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా $ 50 మిలియన్ల మద్దతు ప్యాకేజీని ఇస్తుంది. 

  • 01 Mar 2022 11:15 AM (IST)

    ఉక్రెయిన్‌కు EU 70 యుద్ధ విమానాలు

    ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి సహాయం చేసేందుకు ఉక్రెయిన్ ముందుకు వచ్చింది. వాస్తవానికి, ఉక్రెయిన్ వైమానిక దళం EU నుంచి 70 యుద్ధ విమానాలను దేశానికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో బల్గేరియా 16 MiG-29, 14 Su-25లను ఇస్తుంది. పోలాండ్ 28 MiG-29,  స్లోవేకియా 12 MiG-29 ఇవ్వనుంది.

  • 01 Mar 2022 11:14 AM (IST)

    రష్యా దాడిలో 70 మందికి పైగా ఉక్రెయిన్ సైనికుల మరణం

    ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. నిజానికి, రష్యా సైన్యం చేసిన దాడిలో 70 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఓఖ్టిర్కాలో ఉన్న సైనిక స్థావరాన్ని ఫిరంగితో టార్గెట్ చేసుకుంది. ఓఖ్టిర్కా నగరం ఖార్కివ్, కైవ్ మధ్య ఉంటుంది.

  • 01 Mar 2022 11:11 AM (IST)

    వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని..

    ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి రష్యాలోని ఉక్రెయిన్‌లో యుద్ధంపై సమావేశమైంది. ఈ సమావేశంలో సోమవారం అత్యవసర చర్చకు తీర్మానం చేశారు. అదే సమయంలో చర్చకు అనుకూలంగా 29 ఓట్లు రాగా, 5 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. అదే సమయంలో ఈ సమావేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ప్రతిసారీ భారతదేశం, ఇతర 13 దేశాలు పాల్గొనలేదు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని, 40 సంవత్సరాల తర్వాత UNHC సమావేశాన్ని పిలిచింది. ఈ సమావేశంలో, యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ రష్యాను వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని కోరారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ ప్రతినిధి, రష్యా ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

  • 01 Mar 2022 11:01 AM (IST)

    ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం

    ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా సేనలు దాడి చేస్తున్నట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిర్వహించిన ఐక్య రాజ్యసమితి అత్యవసర జనరల్ అసెంబ్లీలో.. ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి దీనికి సంబంధించి ఆధారాలను చదివి వినిపించారు. తాము ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు ఉక్రెయిన్‌లోని తన తల్లికి రష్యాకు చెందిన ఓ సైనికుడు మొబైల్ ఫోన్‌లో పంపిన మెసేజ్ ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు, రష్యా తన సేనలను ఉపసంహరించుకునేందుకు అంతర్జాతీయ సమాజం రష్యాపై ఒత్తిడి తీసుకురాలని ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి కోరారు.

  • 01 Mar 2022 10:12 AM (IST)

    ఆరో రోజు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

    ఆరో రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగాయి.. అటు చర్చలు జరుగుతున్న సమయంలో కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వైపు వేగంగా సాగుతున్న దృశ్యాలు శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపించాయి.

  • 01 Mar 2022 10:11 AM (IST)

    పోలాండ్‌- బెలారస్‌ సరిహద్దులో మరో దఫా చర్చలు

    తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా కోరింది. అయితే ఈ డిమాండ్లపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు, దీంతో మరోసారి చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. పోలాండ్‌- బెలారస్‌ సరిహద్దులో మరో దఫా చర్చలు జరగనున్నాయి.

  • 01 Mar 2022 10:10 AM (IST)

    దేశం వీడుతున్నారు ఉక్రెయిన్‌ వాసులు..

    నివాస ప్రాంతాలపై కూడా బాంబుల దాడికి దిగడంతో పిల్లాపాపలతో సహా దేశం వీడుతున్నారు ఉక్రెయిన్‌ వాసులు. ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి లక్షలాది మంది సరిహద్దు దేశాలకు వలస వెళుతున్నారు. సోలాండ్‌తో పాటు ఇతర దేశాల్లో తల దాచుకుంటున్నారు.

  • 01 Mar 2022 10:09 AM (IST)

    నివాస ప్రాంతాలపై కూడా బాంబుల వర్షం

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నివాస ప్రాంతాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. దీంతో కీవ్‌తో పాటు ఇతర నగరాల్లో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ? ఏం బాంబు మీద పడుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

  • 01 Mar 2022 09:53 AM (IST)

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలు

    ఉక్రెయిన్​లో హింసాత్మక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపింది. అటు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

  • 01 Mar 2022 09:35 AM (IST)

    ఉక్రెయిన్‌పై దాడితో రష్యాను ఏకాకి చేసేందుకు..

    ఉక్రెయిన్‌పై దాడితో రష్యాను ఏకాకి చేసేందుకు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్‌బాల్‌ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌ తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్టు ఫిఫా, UEFA వెల్లడించాయి. అ ఏడాది చివర్లో జరగనుంది ఫిపా వరల్డ్‌కప్‌. దీని కోసం ఈనెల 24 పోలాండ్‌తో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది రష్యా. అయితే ఫిఫా ఆంక్షలు విధించింది.

  • 01 Mar 2022 08:44 AM (IST)

    ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్ ఆయుధాలను ఇవ్వనున్న కెనడా

    ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సహాయం చేసేందుకు కెనడా ముందుకు వచ్చింది. కెనడా ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్ ఆయుధాలను సరఫరా చేస్తుంది. దీనితో పాటు రష్యా చమురు దిగుమతిని కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.

     

  • 01 Mar 2022 08:41 AM (IST)

    భారత్ గైర్హాజరు కావడంపై భద్రతా మండలిలో ప్రశ్నించిన అమెరికా

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ గైర్హాజరు కావడంపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పోక్స్ నెడ్ ప్రైస్‌ని ప్రశ్నించారు. “మాకు భారత్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. మా భారతీయ భాగస్వాములతో తరచుగా పరస్పరం వ్యవహరిస్తాము. ఒక సంబంధం ఉంది. వారితో చర్చించాము.” అని తెలిపింది.

  • 01 Mar 2022 08:31 AM (IST)

    రొమేనియా మీదుగా భారత్ చేరుకున్న విద్యార్థులు..

    ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 182 మంది విద్యార్థులతో కూడిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి ముంబైకి చేరుకుంది. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మంత్రి నారాయణ్‌ రాణే విమానాశ్రయానికి చేరుకున్నారు. 

  • 01 Mar 2022 08:28 AM (IST)

    న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు..

    ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇందులో రష్యా సైన్యం మిలిటరీ చర్యను త్వరలో నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు

  • 01 Mar 2022 08:27 AM (IST)

    అంతర్జాతీయంగా రష్యాను భారీ ఎదురుదెబ్బ

    ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యాను దెబ్బకొట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్‌బాల్‌ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో ప్రకటించాయి.

  • 01 Mar 2022 07:09 AM (IST)

    ఫలిస్తున్న ఆర్ధిక ఆంక్షలు.. రష్యన్ బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర దెబ్బ..

    రష్యాపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆర్థిక ఆంక్షలు ఫలితాన్ని ఇస్తున్నాయి. స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడం సహా పలు నిర్ణయాలు రష్యాలోని బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. రష్యా కరెన్సీ అయిన రూబుల్ తీవ్రంగా పతనమైంది.

Follow us on