AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణ్యం చేయబోతే పాపం ఎదురైంది.. మృగాడి నుంచి పిల్లలను కాపాడినందుకు 15 ఏళ్లు జైలుశిక్ష

ఓ సామాన్యుడి కోసం ఉఫా ప్రజలంతా ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమంటూ గళమెత్తారు.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు

పుణ్యం చేయబోతే పాపం ఎదురైంది.. మృగాడి నుంచి పిల్లలను కాపాడినందుకు 15 ఏళ్లు జైలుశిక్ష
Balaraju Goud
|

Updated on: Dec 19, 2020 | 5:17 PM

Share

ఓ సామాన్యుడి కోసం ఉఫా ప్రజలంతా ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమంటూ గళమెత్తారు.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు 70 వేల మంది సంతకాలు చేసిన లెటర్‌ని ప్రభుత్వానికి సమర్పించారు. అంతలా ప్రజల మద్దతును కూడబెట్టింది ఎదోక పార్టీ నాయకుడు కాదు.. రష్యాకు చెందిన అతనొక సాధారణ కారు మెకానిక్ వ్లాదిమిర్ సంకిన్‌.. ఇప్పుడతడు అక్కడి ప్రజల దృష్టిలో హీరోగా నిలిచాడు.

రష్యా ఉఫా నగరంలో నివసిస్తున్న వ్లాదిమర్‌ సంకిన్‌ కారు మెకానిక్‌గా పని చేస్తూ, భార్య, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఆనందంగా సాగిపోతున్న అతడి జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పింది. ఉన్నట్టుండి అతడు హంతకుడిగా మారాడు. వ్లాదిమర్‌ సంకిన్‌ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ పదిహేనేళ్ల కుర్రాడు సాయం చేయాల్సిందిగా కేకలు వేయడం సంకిన్‌కు వినిపించింది. దీంతో వెంటనే కేకలు వచ్చిన అపార్ట్‌మెంట్‌లోకి పరిగెత్తుకెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి ఓ పశువు ఇద్దరు మైనర్‌ కుర్రాళ్లపై అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడు. బాలురిద్దరికి ఒంటి మీద బట్టలు లేవు. నిందితుడు వారిచేత బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఇది చూసిన సంకిన్‌ నిందుతుడిని చితకబాదాడు. ముఖం, తల మీద బలంగా దాడి చేశాడు. సంకిన్‌ దెబ్బలకు తాళలేక నిందితుడు కింద పడిపోయాడు. ఇక పిల్లల్నిద్దర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిన సంకిన్‌ అంబులెన్స్‌కి కాల్‌ చేశాడు. దురదృష్టం కొద్ది ఆస‍్పత్రికి తీసుకెళ్తుండగా నిందితుడు మరణించాడు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు సంకిన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడికి 15 సంవత్సరాల శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు వెలువరించింది

అయితే, కోర్టు తీర్పును స్థానిక ప్రజలు తప్పుబడుతున్నారు. ఓ మృగాడి బారి నుంచి పిల్లల్ని కాపాడినందుకు శిక్ష విధించడం అన్యాయమంటూ గళమెత్తారు. నిందితుడు వ్లాదిమిర్ జైట్సేవ్ పలు నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ అనేక మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడేవాడని స్థానికులు తెలిపారు. గతంలో ఇదే నేరం కింద పోలీసులు రెండు సార్లు అతడిని అరెస్ట్‌ చేశారు. జైలు జీవితం కూడా అనుభవించాడు. నిందితుడిని హతమార్చడం ఈ మాత్రం నేరం కాదని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

దుర్మార్గుడి నుంచి చిన్నారులను రక్షించే ప్రయత్నంలో సంకెన్ దాడి చేశాడు. ఈ క్రమంలో నిందితుడు జైట్సేవ్ మరణించాడు. దీంతో జనాలు సంకిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అతడు రియల్‌ హీరో పిల్లలను కాపాడి న్యాయం చేశాడు. కానీ, కోర్టు అతడికి శిక్ష విధించి అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమై జోక్యం చేసుకుని సంకెన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు స్థానికులంతా సంతకాల సేకరణ చేసిన లెటర్ ను రష్యా ప్రభుత్వానికి పంపించారు.

ఇదిలావుంటే దీనికి సంబంధించి సంకిన్‌ స్పందిస్తూ.. ఆ కుర్రాడు సాయం కోరినప్పుడు నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నా దారిన నేను వెళ్లడం.. రెండు వారిని కాపడటం. నేను రెండోదాన్ని ఎంచుకున్నాను. నా స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారని తెలిపాడు. ఇక, వ్లాదిమర్‌ తరపు న్యాయవాది అతడి శిక్షను రద్దు చేయాలని లేదంటే తగ్గించాలని కోర్టును కోరుతున్నాడు.