Russia – Ukraine war: పురుషులనూ వదలడం లేదు.. ఉక్రెయన్ పౌరులపై రష్యా సేనల పైశాచికం

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం(Russia - Ukraine War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఎందరో మరణించగా.. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా సేనలు చేస్తున్న దాడులు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి....

Russia - Ukraine war: పురుషులనూ వదలడం లేదు.. ఉక్రెయన్ పౌరులపై రష్యా సేనల పైశాచికం
Minor girl raped

Updated on: May 04, 2022 | 4:48 PM

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం(Russia – Ukraine War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఎందరో మరణించగా.. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా సేనలు చేస్తున్న దాడులు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి. గతంలో మహిళలను లైంగికంగా వేధించిన సేనలు.. ఇప్పుడు మగవాళ్లనూ వదలడం లేదు. పురుషులు, బాలురు పై రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదైనట్లు గుర్తించామని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉక్రెయిన్‌ పౌరులకు భయం కలిగించేందుకే రష్యా సైనికులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఆధారాలు దొరికడంతో తాము క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అత్యాచారాన్ని నేరంగా భావిస్తుండటంతో మహిళలు, బాలికలు వారిపై లైంగిక దాడి జరుగుతున్నట్లు చెప్పలేకపోతున్నారు. బాధితులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఐరాస విభాగ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్‌ సూచించారు. అధికారికంగా నమోదైన కేసులు కొన్నే ఉన్నాయని.. ఇంకా బయటకు రాని కేసులు ఎన్నో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

పురుషులు, మహిళలు, చిన్నారులపై రష్యా సైన్యం జరుపుతోన్న లైంగిక దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ ఇరినా వెనెదిక్తొవా తెలిపారు. తమపై ఇలాంటి నేరాలు జరిగాయని కొందరు మాత్రమే చెబుతుండగా.. మరికొందరు మాత్రం దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం పేరుతో రష్యా సైన్యం సృష్టిస్తున్న అరాచకాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. గ్యాంగ్‌రేప్‌లు, కుటుంబ సభ్యులముందే లైంగిక దాడుల వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. కేవలం ఒక్క బుచా నగరంలోని ఓ బేస్‌మెంట్‌లోనే మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి ఇప్పటికే 25మంది బాధితులను నుంచి ఆధారాలు సేకరించినట్లు ఐరాస స్పష్టం చేసింది.

తమ లక్ష్యం సామాన్య పౌరులు కాదు.. సైన్యమే టార్గెట్‌ అంటూ యుద్ధం ఆరంభించిన పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌లోని మహిళలు, చిన్నారులనూ వదలడం లేదు. దాదాపు 400 లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడమే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సృష్టిస్తోన్న అరాచకానికి నిదర్శనంగా నిలుస్తోంది. రష్యా సైనికులపై దాదాపు 400లకు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్‌ అంబుడ్స్‌మెన్‌ లియుడ్‌మైలా డెనిసోవా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

MLC Kavitha: మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో మీ ఇష్టం.. బోర్డ్ తీసుకురండి..

RBI Governor: సామాన్యులకు షాకిచ్చిన ఆర్బీఐ.. వడ్డీరేట్లు భారీగా పెంపు.. ప్రియం కానున్న ఆ ధరలు..