అది మామూలు టాయిలెట్‌ కాదు..వజ్రఖచిత శౌచాలయం !

| Edited By: Srinu

Nov 07, 2019 | 8:09 PM

వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్‌కు చెందిన వజ్రాభరణాల బ్రాండ్‌ కొరోనెట్‌ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్‌ షప్‌ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్‌ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు […]

అది మామూలు టాయిలెట్‌ కాదు..వజ్రఖచిత శౌచాలయం !
Follow us on

వేసేందుకు జుట్టు ఉండాలే గానీ, సిగముడులకు కొదువేది అన్నట్లుగా..డబ్బులుండాలే గానీ ఎన్నీ వేషాలైన వేయవచ్చు. సరిగ్గా ఇదే నానుడికి సరిపోయే ఓ సంఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. ఓ బంగారు దుకాణాల యజమాని బంగారం, వజ్రాలతో పొదిగగిన ఒక టాయిలెట్‌ని తయారు చేయించాడు..వివరాలు పరిశీలించినట్లయితే..హాంకాంగ్‌కు చెందిన
వజ్రాభరణాల బ్రాండ్‌ కొరోనెట్‌ అనే జ్యుయెలరీ షాపు యజమాని ఆరోన్‌ షప్‌ ఒక ఆకర్షణీయమైన టాయిలెట్‌ను తయారు చేయించాడు. అవి రోటిన్‌ అనుకున్నాడేమో..దానికి వజ్రాలను పొదిగించాడు. 334.68 క్యారెట్లు బరువు ఉన్న 40,815 వజ్రాలతో దానిని తయారు చేయించాడు. దాని మొత్తం విలువ 1.3 మిలియన్‌ డాలర్లు కాగా, భారత కరెన్సీలో రూ.9 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ వజ్రఖచిత శౌచాలయ పీఠాన్ని చైనాలోని షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే, దీనిని అమ్మడానికి కాదని చెప్పిన ఆరోన్‌ షప్‌..కేవలం తనకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్‌ చేశానని, ఇది తన ఆసక్తి మాత్రమే అని వెల్లడించారు. కాగా ఈ బంగారు, వజ్రాలు పొదిగిన టాయిలెట్‌ మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.