Lucky Draw: యూఏఈలో జాక్‌పాట్ కొట్టేసిన ప్రవాస భారతీయుడు.. లక్కీ డ్రాలో ఊహించని విధంగా..

Lucky Draw: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారతీయులు ఎంతో సెటిల్ అయ్యారు. ముఖ్యంగా..

Lucky Draw: యూఏఈలో జాక్‌పాట్ కొట్టేసిన ప్రవాస భారతీయుడు.. లక్కీ డ్రాలో ఊహించని విధంగా..

Updated on: Jan 05, 2021 | 8:50 AM

Lucky Draw: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారతీయులు ఎంతో మంది సెటిల్ అయ్యారు. ముఖ్యంగా జీవనోపాధి కోసం యూఏఈకి చాలా మంది భారతీయులు వలస వెళుతుంటారు. అలా జీవనోపాదికై వెళ్లి ఎంతో మంది భారతీయులు అక్కడ సెటిల్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రవాస భారతీయుడు యూఏఈలో జాక్‌పాట్ కొట్టేశాడు. ఒక్క లక్కీ డ్రాతో అతని జీవితమే మారిపోయింది.

యూఏఈలో నిర్వహించిన లక్కీ డ్రాలో ప్రవాస భారతీయుడు నోబిన్ మాథ్యూ 4.08 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. అంటే అది భారత కరెన్సీలో సుమారు రూ. 29.6 కోట్లు. నోబిన్ మాథ్యూ ఒక స్పేర్ పార్ట్స్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ క్రమంలో అబుదాబి బిగ్ టికెట్‌లో ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా లక్కీ డ్రా గెలుచుకున్నట్లు అబుదాబి బిగ్ టికెట్ డ్రా నిర్వాహకులు మాథ్యూకి ఫోన్ చేసి చెప్పారు. దాంతో నోబిన్ మాథ్యూ తొలుత షాక్‌కు గురయ్యాడు. ఆ తరువాత లక్కీ డ్రా తాను గెలుపొందినందుకు తెగ సంబరపడిపోతున్నాడు.

 

Also read:

Brian Lara:టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ.. ఆ స్టేడియం పేరునే కూతురి పేరుగా పెట్టిన బ్రియాన్ లారా..

Celebrities in BJP: బీజేపీలోకి మరో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ నటీమణులు?.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా?..