Brian Lara: టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ.. ఆ స్టేడియం పేరునే కూతురి పేరుగా పెట్టిన బ్రియాన్ లారా..

Brian Lara: బ్రియాన్ లారా.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఎవరూ ఉండరు. తన దూకుడు..

Brian Lara: టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ.. ఆ స్టేడియం పేరునే కూతురి పేరుగా పెట్టిన బ్రియాన్ లారా..
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 05, 2021 | 1:10 PM

Brian Lara: బ్రియాన్ లారా.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఎవరూ ఉండరు. తన దూకుడు ప్రదర్శనతో వెస్టిండీజ్ జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, సరిగ్గా ఇదే రోజున వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. డబుల్ సెంచరీ కూడా పూర్తి చేశారు.

1993, జనవరి 5వ తేదీన సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రియాన్ లారా 121 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 277 పరుగులు చేసి వెస్టిండీస్ ఓడిపోకుండా మ్యాచ్ డ్రా అయ్యేలా చేశాడు. అయితే, లారాను షేన్ వార్న్ రన్ చేయకపోయి ఉంటే.. భారీ స్కోర్ నమోదు చేసేవాడని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు.

ఇదంతా ఇలాఉంటే.. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి సెంచరీ, డబుల్ సెంచరీ నమోదు చేయడంతో లారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ పరుగులకు గుర్తుగా.. తన మొదటి కూతురుకు సిడ్నీ అని పేరు పెట్టాడు. అప్పుడది హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, 131 టెస్ట్ మ్యాచ్‌లు, 299 వన్డేలు ఆడిన బ్రియాన్ లారా.. 2007 ఏప్రిల్ 9న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.