AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా బిడ్డ పేరు ఇదే..

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి మేఘన్‌ మార్కెల్‌ మే 6వ తేదీ సోమవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్తగా తల్లిదండ్రులైన ఈ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఈ చిన్నారికి ఆర్చీ అని పేరుపెట్టారు. తమ కుమారుడి పూర్తి పేరు ‘ఆర్చీ హ్యారిసన్‌ మౌంట్‌బాటన్‌-విండ్సర్‌’ అంటూ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హ్యారీ, మార్కెల్‌ దంపతులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాతృత్వం […]

మా బిడ్డ పేరు ఇదే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2019 | 2:36 PM

Share

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి మేఘన్‌ మార్కెల్‌ మే 6వ తేదీ సోమవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్తగా తల్లిదండ్రులైన ఈ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున ఈ చిన్నారికి ఆర్చీ అని పేరుపెట్టారు. తమ కుమారుడి పూర్తి పేరు ‘ఆర్చీ హ్యారిసన్‌ మౌంట్‌బాటన్‌-విండ్సర్‌’ అంటూ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హ్యారీ, మార్కెల్‌ దంపతులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాతృత్వం ఓ అద్భుత అనుభవం అంటూ మేఘన్‌ మార్కెల్‌ పేర్కొన్నారు.