
ఇరుగూ, పొరుగూ, ప్రపంచ దేశాలు వారిపై కనికరం కూడా చూపలేదు.. పైగా అనుమానపు చూపులతో తమ దేశంలోకి రానివ్వలేదు.. బంగ్లాదేశ్ మాత్రం పొరుగు దేశంలో కష్టాలు పడుతున్నా సాటి మతస్తులను ఆదుకోవడం బాధ్యతగా భావించి తమ దేశంలోకి వచ్చేందుకు సరిహద్దులు తెరిచింది. ఇప్పుడు ఆ దేశానికి వారు భారంగా మారిపోయారు.. 2017 సంవత్సరంలో మయన్మార్ మిలిటరీ క్రూర అణచివేతతో వందలాది రోహింగ్యా ముస్లింలు ఆ దేశం వదిలి పారిపోయారు.
థాయిలాండ్, మలేసియా, ఇండోనేషియా తదితర దేశాలు తమ దేశంలోకి రోహింగ్యాలు వచ్చేందుకు అనుమతించలేదు.. కానీ భారత్, బంగ్లాదేశ్ మనవతా కోణంలో వారికి అనుమతించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ వారి వారికి ఆశ్రమం, ఆహారం, మందులు, నగదు ఇచ్చి ఆదుకుంది.. దాదాపు 10 వేల మంది రోహింగ్యాలకు ఆశ్రమం కల్పించారు.. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ప్రారంభంలో రోహింగ్యా శరణార్థులను ఆదరించారు.. కానీ ఇప్పుడు వారిని పెద్ద సమస్యగా భావిస్తున్నారు. రోహింగ్యాల కారణంగా దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమరవాణా, తీవ్రవాద కార్యకలాపాల్లో రోహింగ్యాల పాత్ర ఉందని స్థానిక మీడియా, విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. మరోవైపు రోమింగ్యాలను తిరిగి మయన్మార్‌కు పంపేందుకు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది.. ఈ దశలో రోహింగ్యాలు బంగ్లాకు భారంగా మారారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..