UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. మూడో రౌండ్‌లోనూ రిషి సునాక్ ఆధిక్యం..

|

Jul 19, 2022 | 2:42 PM

UK PM Race: కన్జర్వేటివ్ ఎంపీల మూడవ రౌండ్ బ్యాలెట్‌ పోల్‌లో సునాక్‌కు 115 ఓట్లు వచ్చాయి. మాజీ రక్షణ మంత్రి పెన్నీ మోర్డాంట్‌కు 82, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 71 ఓట్లు, కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు సాధించారు.

UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. మూడో రౌండ్‌లోనూ రిషి సునాక్ ఆధిక్యం..
Rishi Sunak
Follow us on

Rishi Sunak – UK PM Race: బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో ఉన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నాయకుడు రిషి సునాక్‌ మరో ముందడుగు వేశారు. తొలి రౌండు రౌండ్ల ఓటింగ్‌లో రిషి సునాక్‌ అత్యధిక మంది ఎంపీల మద్దతుతో ముందంజలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మరో రౌండ్‌ పోల్‌లో కూడా సత్తాచాటారు. సోమవారం జరిగిన కన్జర్వేటివ్ ఎంపీల మూడవ రౌండ్ బ్యాలెట్‌ పోల్‌లో సునాక్‌కు 115 ఓట్లు వచ్చాయి. మాజీ రక్షణ మంత్రి పెన్నీ మోర్డాంట్‌కు 82, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 71 ఓట్లు, కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు సాధించారు. మంగళవారం నాలుగో రౌండ్ ఎన్నిక జరగనుంది. నాలుగో రౌండ్‌లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ తర్వాత కొందరు మరికొందరు ఎలిమినేట్ కానున్నారు. ఇలా గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగలనున్నారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్‌ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.

వాస్తవానికి శాసనసభలో ఉన్న ఎంపీలు పలు రౌండ్ల అనంతరం కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్‌ను ఎన్నుకోనున్నారు. పార్టీ లీడర్‌గా ఎవరు నిలుస్తారో.. వారే బ్రిటన్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. మొదట ఈ పదవికి ఎనిమిది మంది పోటీపడ్డారు. మూడు రౌండ్లలో నలుగురు అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. కుంభకోణాలు, అభియోగాలు రావడం.. పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జాన్సన్‌ ఈనెల 7న బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..