Rishi Sunak Pongal lunch: బ్రిటన్ అధికారులకు అరిటాకులో కమ్మని భారతీయ భోజనం.. ప్రధాని రిషి సునాక్ సంక్రాంతి విందుకు ఫిదా..

బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఏది చేసిన ఓ ప్రత్యేకత చూపిస్తున్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలను..

Rishi Sunak Pongal lunch: బ్రిటన్ అధికారులకు అరిటాకులో కమ్మని భారతీయ భోజనం.. ప్రధాని రిషి సునాక్ సంక్రాంతి విందుకు ఫిదా..
Pongal Lunch Hosted By Pm Rishi Sunak In London

Updated on: Jan 17, 2023 | 3:51 PM

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి పొంగల్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఏది చేసిన ఓ ప్రత్యేకత చూపిస్తున్నారు. తాజాగా సంక్రాంతి వేడుకలను తనదైన తరహాలో జరుపుకున్నారు. పీఎం ఆఫీస్ సిబ్బందితోపాటు డిఫెన్స్ సిబ్బందిని పొంగల్ లంచ్‌కి ఆహ్వానించారు. పూర్తి భారతీయ పద్ధతిలో వారికి భోజనలను ఏర్పాటు చేశారు. అరటి ఆకులపై సంక్రాంతి పసందైన పిండి వంటలతో భోజనం వడ్డించారు. అరటి ఆకులో పప్పు, అన్నం, సాంబాపర్, ఆరటి పండుతోపాటు చివరికి పెరుగును కూడా అందించారు.

వారంత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకుపై భోజనాన్ని ఆస్వాధించారు. స్పూన్లు, ఫోర్కులు కాకుండా చేతులతో ఆహారాన్ని తీసుకోవడం చాలా వెరైటీ కనిపించింది. చేతులతో ఆహారాన్ని తింటున్నట్లు ఓ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు పొంగల్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు UKలోని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది కొత్త పంటల పండుగను జరుపుకుంటున్నప్పుడు.. రుచికరమైన తీపి వంటకం పొంగల్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇడ్లీతో..

ఈ వీడియోలో యూనిఫారం ధరించిన అధికారులు, ఇతర అధికారులు వరుసగా కూర్చుని పొంగల్ అన్నం, బెల్లం, పాలతో చేసిన స్వీట్‌ను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. అరటి ఆకులపై ఇడ్లీ, చట్నీ, అరటిపండ్లను వడ్డించుకుని తిన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులకు పొంగల్‌ను పురస్కరించుకుని UK ప్రధానమంత్రి రిషి సునక్   శుభాకాంక్షలు తెలిపారు. సునక్  పీఎం ఆఫీస్ సిబ్బందితోపాటు డిఫెన్స్ సిబ్బందికి పొంగల్ లంచ్‌ని ఏర్పాటు చేశారు.

ఈ వీడయో ఇప్పుడు సోషల్ మీడియా అన్ని వేదికలపై తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం