సౌదీ అరేబియాలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. అయితే రంజాన్ మాసం ప్రారంభం కాకముందే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కొన్ని కొత్త రూల్స్ ప్రకటించారు. ఈ నిర్ణయాలపై మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. రంజాన్ మాసంలో దేశంలోని ప్రతి పౌరుడు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ క్రమంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అక్కడి మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లకు సంబంధించి సౌదీ అరేబియాలోని మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించాలని పేర్కొన్నారు. మసీదులో అమర్చిన లౌడ్ స్పీకర్ వాల్యూమ్ మూడింట ఒక వంతు కంటే తక్కువగా ఉండాలని సూచించింది. ఇప్పటికే సౌదీ అరేబియాలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల సంఖ్యను 4కి తగ్గించారు. మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను అజాన్, ఇఖామత్ కోసం మాత్రమే ఉపయోగించాలని కూడా ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఇఖామత్ అంటే ప్రజలను రెండవసారి ప్రార్థనకు పిలవడం అన్నమాట.
మసీదు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు సౌదీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం వల్ల పిల్లల నిద్రకు భంగం కలుగుతుందని, వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని వీటిలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. మసీదులకు అమర్చిన లౌడ్ స్పీకర్ల వల్ల శబ్ద కాలుష్యం వ్యాపిస్తోందని ఫిర్యాదు చేశారు. గత 1400 సంవత్సరాల చరిత్రలో, ఇస్లాం అనేక హెచ్చు తగ్గులను చూసింది. ఎవరూ ఊహించనంతగా ఇస్లాంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇందులో సౌదీ అరేబియా అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది. సౌదీ ప్రభుత్వ ఈ క్రమంలో కేవలం మసీదులో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లపైనే కాకుండా మరిన్ని ఆంక్షలు విధించింది. దేశంలోని మసీదుల్లో దానం చేయడంపై నిషేధం విధించారు. అలాగే మసీదు లోపల అజాన్ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆదేశించారు. అంతే కాకుండా రోజే చేసే వ్యక్తులు పిల్లలను మసీదులోకి తీసుకురాకుండా నిషేధం విధించారు. మసీదులో చిన్నారులు ఉండడం వల్ల ప్రార్థనలకు ఆటంకాలు ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక ప్రపంచంలోని 50 ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా చాలా ముఖ్యమైన దేశం. మౌలిక మార్పుల సునామీ ఎక్కడ కనిపించదు. ఇంతకుముందు సౌదీ అరేబియాలో మహిళలు కార్లు నడపడంపై నిషేధం ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు. సౌదీ అరేబియాలోని మహిళలు ఇప్పుడు మ్యాచ్‌లు చూడటానికి స్టేడియంకు వెళ్లవచ్చు. అంతకుముందు ఆంక్షలను మారుతున్న కాలానుగుణంగా మార్చుకుంటూ వస్తున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే, ఏ ఇస్లామిక్ దేశమైనా ఇలాంటి చర్యలు తీసుకుంటుందని నమ్మడం కష్టం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..