Queensland floods: భారీ వర్షాలతో ఇక్కడ వింతైన దృశ్యం.. నీటిలో మునిగిన భవనాలు, విమానాలు, రోడ్డుపై ఈత కొడుతున్న మొసళ్లు…

ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌లాండ్‌లో వర్షం, ఆపై వరదల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. తుపాను కారణంగా ఏడాది పొడవునా ఏకధాటిగా వర్షాలు కురిశాయని చెబుతున్నారు. వర్షం ముప్పు ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 24 గంటల్లో ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వేలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Queensland floods: భారీ వర్షాలతో ఇక్కడ వింతైన దృశ్యం.. నీటిలో మునిగిన భవనాలు, విమానాలు, రోడ్డుపై ఈత కొడుతున్న మొసళ్లు...
Queensland Floods

Updated on: Dec 18, 2023 | 4:58 PM

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగి  వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదలతో వీధులోకి, నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలోని వీధుల్లో మొసళ్లు ఈదుతున్నాయి. విమానాశ్రయం కూడా మునిగిపోయింది. విమానాలు కూడా నీటిలో మునిగిపోయాయి. పరిస్థితి విషమించడంతో.. వేలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇళ్లలోకి, రోడ్లపైకి నీరు చేరుకోవడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి పడవలపైనే ప్రయాణించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌లాండ్‌లో వర్షం, ఆపై వరదల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. తుపాను కారణంగా ఏడాది పొడవునా ఏకధాటిగా వర్షాలు కురిశాయని చెబుతున్నారు. వర్షం ముప్పు ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 24 గంటల్లో ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వేలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నీటమునిగిన ఇల్లు, విద్యుత్తుకు అంతరాయం, త్రాగునీరు లేదు

అక్కడ పరిస్థితి క్లిష్టంగా ఉంది.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మందిని రక్షించారు. అయితే చాలా ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, సురక్షితమైన తాగునీరు వంటి నిత్యావసర సేవలు దెబ్బతిన్నాయి. వర్షాలు మొదలైనప్పటి నుంచి కైర్న్స్ నగరంలో 2 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్  స్టీవెన్ మైల్స్ స్పందిస్తూ తన జీవితంలో ఇప్పటి విపత్తు ను జీవితాంతం గుర్తుంచుకోగలిగినది” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

క్వీన్స్‌లాండ్‌లో వరదల కారణంగా కెయిర్న్స్ విమానాశ్రయం (CNS) మూతపడింది. 12 గంటల్లో 600 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసి.. గత రికార్డులను అధిగమించింది. విమానాలు రద్దు చేయడంతో అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి.

 

క్వీన్స్‌లాండ్‌లో ఉప్పొంగుతున్న నదులు

సోమవారం నగరం అంతా  కుండపోత వర్షం కురుస్తుందని.. లోతట్టు ప్రాంతాలపై వర్షాల, వరదల  ప్రభావం పెరుగుతుందని అంచనా చేసింది అక్కడ వాతావరణ శాఖ. మంగళవారం వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. అయితే నదుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోలేదు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాబోయే రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంటున్నారు. నదుల్లో నీటిమట్టం పెరిగితే.. అంచనాల ప్రకారం 1977 తర్వాత రికార్డు స్థాయిలో నీటిమట్టం చేరడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..