Kohinoor Diamond: క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత మన ‘కోహినూర్‌’ ఇక ఆమె సిగపైనే! భారత్‌ నుంచి బ్రిటన్ వరకు కోహినూర్ ప్రయాణం ఇలా..

|

Sep 09, 2022 | 1:46 PM

బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు ఏలిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం 96 యేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఐతే ఎలిజబెత్‌-2 తర్వాత కోహినూర్‌ ఎవరి సిగలో అలంకరించనున్నరనే విషయం ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది..

Kohinoor Diamond: క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత మన ‘కోహినూర్‌’ ఇక ఆమె సిగపైనే! భారత్‌ నుంచి బ్రిటన్ వరకు కోహినూర్ ప్రయాణం ఇలా..
Kohinoor Diamond
Follow us on

Who is Camilla, UK’s Queen-to-be who will wear Kohinoor? బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు ఏలిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురువారం 96 యేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఐతే ఎలిజబెత్‌-2 తర్వాత కోహినూర్‌ ఎవరి సిగలో అలంకరించనున్నరనే విషయం ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఐతే యువరాజుగా పట్టాభిషేకం పొందనున్న కింగ్‌ ఛార్లెస్‌ అర్ధాంగి కెమిల్లాకు రాణి హోదా దక్కుతుంది. సాధారణంగా రాజవంశీకుల్లో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. దీంతో కోహినూర్‌ వజ్రంతో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. బ్రిటన్‌లో జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఎలిజబెత్‌-2 స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన తర్వత కోడలు కెమిల్లా కోహినూర్ పొదిగిన కిరీటం అదిరోహించాలని తన ప్రసంగంలో ఆకాంక్షించారు.
భారత్‌ నుంచి ఎన్నో చేతులు మారిన కోహినూర్‌ 1849లో బ్రిటీష్‌ వాళ్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత కోహినూర్‌ను తమ దేశానికి తరలించారు. ఆ తర్వాత 1937లో కింగ్ జార్జ్‌-6 ప్లాటినంతో తయారు చేసిన కిరీటంలో 105.6 క్యారెట్ల కోహినూర్‌ను ఉంచి దానిని తన పట్టాభిషేక సమయంలో తన సతీమణికి అలంకరించాడు. అప్పటి నుంచి రాజ కుటుంబీకుల కిరీటంలో మన కోహినూర్‌ వెలుగులీనుతోంది. అది ఇప్పుడు ఎలిజబెత్‌-2 నుంచి కెమిల్లాకు చేరుతుంది. ఐతే ప్రిన్స్‌ చార్లెస్‌కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య ప్రిన్స్‌ డయానాకు 1996కు విడాకులిచ్చారు. ఆమె ఏడాదికే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.