Prince Philip death: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ IIకు పతీవియోగం… ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత

Prince Philip: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. అనారోగ్యానకిి గురైన ప్రిన్స్.. ఈ మధ్యే కోలుకున్నారు. అయితే మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఈ ఉదయం చికిత్స పొందుతూ...

Prince Philip death:  బ్రిటన్  క్వీన్ ఎలిజబెత్ IIకు పతీవియోగం... ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
Prince Philip

Edited By:

Updated on: Apr 09, 2021 | 5:23 PM

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. అనారోగ్యానకిి గురైన ప్రిన్స్.. ఈ మధ్యే కోలుకున్నారు. అయితే మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఈ ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ II భర్త డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్నారు. అయితే మరో సారి ఆయన ఆరోగ్యం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఈ ఉదయం మృతిచెందారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ‌ప్యాలెస్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను ప్రకటించారు.

“హర్ మెజెస్టి క్వీన్ తన ప్రియమైన భర్త, అతని రాయల్ హైనెస్ ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ మరణం ప్రకటించినందుకు తీవ్ర దుఖంతో ఉంది. అతని రాయల్ హైనెస్ ఈ ఉదయం విండ్సర్ కాజిల్ వద్ద కన్నుమూశారు” అని రాయల్ ఫ్యామిలీ ట్విట్టర్లో పోస్టు చేసింది.