డ్రైవింగ్ లైసెన్స్ సరెండర్ చేసిన యువరాజు

లండన్: బ్రిటన్ యువరాజు ఫిలిప్ తన డ్రైవింగ్ లైసెన్సును స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు తన లైసెన్సును నోర్‌ఫోల్క్ పోలీసులకు సరెండర్ చేసినట్లు బకింగ్‌హామ్ ఫ్యాలెస్ తెలిపింది. అయితే లైసెన్సును వదులుకున్నప్పటికీ.. ప్రైవేట్ రహదారులపై ఫిలిప్ డ్రైవింగ్ చేయొచ్చని న్యాయనిపుణులు తెలిపారు. కాగా గత నెల 17న శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ వద్ద ఫిలిప్ నడుపుతున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మా ఫెయిర్‌వెదర్ అనే మహిళకు స్వల్ప గాయం కాగా.. ఫిలిప్ సురక్షితంగా […]

డ్రైవింగ్ లైసెన్స్ సరెండర్ చేసిన యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు ఫిలిప్ తన డ్రైవింగ్ లైసెన్సును స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు తన లైసెన్సును నోర్‌ఫోల్క్ పోలీసులకు సరెండర్ చేసినట్లు బకింగ్‌హామ్ ఫ్యాలెస్ తెలిపింది. అయితే లైసెన్సును వదులుకున్నప్పటికీ.. ప్రైవేట్ రహదారులపై ఫిలిప్ డ్రైవింగ్ చేయొచ్చని న్యాయనిపుణులు తెలిపారు.
కాగా గత నెల 17న శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ వద్ద ఫిలిప్ నడుపుతున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మా ఫెయిర్‌వెదర్ అనే మహిళకు స్వల్ప గాయం కాగా.. ఫిలిప్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే సీటు బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తూ మరోసారి కెమెరాలకు చిక్కారు ఫిలిప్. దీంతో యువరాజుపై విమర్శలు రాగా.. శనివారం తన డ్రైవింగ్ లైసెన్స్‌ను వదులుకున్నారు ఫిలిప్.

Published On - 7:56 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu