ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఈ నెల 16న నేపాల్‌లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపింది. నేపాల్ (Nepal) ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా ఆహ్వానం మేరకు మోడీ వెళ్తున్నట్లు వివరించింది. ప్రధాని మోడీ ఇప్పటివరకు నేపాల్ లో నాలుగు సార్లు పర్యటించారు. నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే బుద్ధ జయంతి కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు. బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫడరేషన్‌కు చెందిన స్థలంలో దీనిని నిర్మిస్తారు. ఇది లుంబిని మోనాస్టరిక్ జోన్‌లో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రజల నాగరికత వారసత్వ సంబంధాలను ఇది మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో వివరించింది.
గత నెల ఏప్రిల్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా న్యూ ఢిల్లీలోని ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. గతేడాది జులైలో ఐదోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేపాల్ ప్రధానమంత్రి దేవుబా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ లో పర్యటించారు. తన ఉన్నత స్థాయి బృందంతో కలిసి చర్చల్లో పాల్గొన్నారు. భారత్-నేపాల్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కలిసి పని చేస్తున్నామని నేపాల్ ప్రధాని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
AP Cabinet Meeting: రైతులకు శుభవార్త.. కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు
IPL 2022: ముంబై దెబ్బకు ఆ చెత్త రికార్డులో చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో రెండోసారి..