Quad Summit PM Modi: ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు.. చైనీస్ టెలికాం కంపెనీలను టార్గెట్ చేసిన క్వాడ్ నేతలు..

|

May 24, 2022 | 11:15 AM

Quad Summit PM Modi: క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వాగతం పలికారు. ఈ సమయంలో, జో బిడ్నీ మాట్లాడుతూ.. మిమ్మల్ని మళ్లీ వ్యక్తిగతంగా కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. 

Quad Summit PM Modi: ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు.. చైనీస్ టెలికాం కంపెనీలను టార్గెట్ చేసిన క్వాడ్ నేతలు..
Quad Summit Pm Modi
Follow us on

జపాన్‌లోని టోక్యో వేదికగా క్వాడ్ గ్రూపు నేతల సమావేశం(quad leaders summit) ప్రారంభమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా పలు అంశాలపై నాలుగు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగింది. టోక్యోలో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశమయ్యారు.  ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే క్వాడ్ గ్రూప్ ప్రపంచ వేదికపై భారత్ ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. అనంతరం క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వాగతం పలికారు. ఈ సమయంలో, జో బిడ్నీ మాట్లాడుతూ.. మిమ్మల్ని మళ్లీ వ్యక్తిగతంగా కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్ట్రేలియా కొత్త ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ను సరదాగా ఎగతాళి చేశారు. మీరు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత  విమానం ఎక్కారు. విశ్రాంతి లేకుండా ఉంటంతో అలిసిపోయి ఉంటారు. ఈ సమావేశాల్లో మీరు నిద్రపోతే ఫర్వాలేదు అంటూ ప్రధానమంత్రి ఆంథోనీపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ జోకులు పేల్చారు. దీంతో అంతా నవ్వడం ప్రారంభించారు.

అనంతరం జరిగిన సమావేశంలో అన్ని దేశాలు చైనాను టార్గెట్ చేశాయి. ఇప్పుడు చైనీస్ టెలికాం రంగానికి చెందిన కంపెనీలపై నిషేధానికి క్వాడ్ నేతల ఏకాభిప్రాయం వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా కంపెనీలను భారత్‌, అమెరికా ఇప్పటికే నిషేధించాయి. ప్రపంచవ్యాప్తంగా టెలికాం పరికరాలను తయారు చేసే చైనా టెలికాం కంపెనీలపై నిఘా పెట్టి డేటా చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చైనా కంపెనీలకు పగ్గాలు వేయడానికి క్వాడ్ నాయకులు వ్యూహం రచిస్తున్నారు. 

హవాయి( Huawei) టెక్నాలజీ వంటి కంపెనీ ప్రపంచంలోని టెలికాం రంగంలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీని భారత్ నిషేధించింది. గూఢచర్యం ఆరోపణలతో పలు చైనా కంపెనీలపై అమెరికా కూడా ఆంక్షలు విధించింది. అనేక టెలికాం రంగ కంపెనీలు చైనీస్ కంపెనీల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయని క్వాడ్ లీడర్లు భావిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా 5G, 6G లలో క్వాడ్ దేశాలలోని వివిధ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.

చౌక ధరల కారణంగా చైనా కంపెనీలు ప్రపంచంలోకి..

క్వాడ్ లీడర్‌లు తమ దేశాల టెలికాం కంపెనీలు హవాయి( Huawei)తో చాలా పోటీగా ఉన్నాయని.. టెలికాం రంగం నుంచి చైనా కంపెనీలను తొలగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ చైనీస్ కంపెనీలు తమ పేటెంట్లు, చౌక ధరల కారణంగా ప్రపంచంలోకి చొరబడుతున్నాయనే అభిప్రయానికి వస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్య దేశాల సార్వభౌమాధికారం.. భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా డేటాను దొంగిలించడం ద్వారా వినియోగదారుల గోప్యతను కూడా ఉల్లంఘించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దొంగిలించబడిన డేటాను చైనీస్ కంపెనీ బహిరంగ మార్కెట్‌లో ఉపయోగిస్తుంది. దానిని తన వ్యాపారంలో చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తుంది.

క్వాడ్ దేశాల టెలికాం కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత..

చైనీస్ టెలికాం కంపెనీలను మినహాయించగలిగేలా క్వాడ్ దేశాల టెలికాం కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని క్వాడ్ దేశాలు ఇప్పుడు అంగీకరించాయి. దీనిపై చైనాకు రెండు సార్లు ఎదురు దెబ్బ తగులుతుంది. దాని ఆర్థిక ప్రయోజనం దెబ్బతింటుంది. అలాగే క్వాడ్ దేశాల భద్రతపై రాజీపడదు.