ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువ.. ఆశీర్వదించిన పోప్ లియో XIV

సెప్టెంబర్ 17తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి బ్రిటిష్ ప్రధాన మంత్రి జార్జియా మలోనీ వరకు, వాటికన్ నగర అధిపతి పోప్ లియో XIV కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువ.. ఆశీర్వదించిన పోప్ లియో XIV
Pm Modi Pope

Updated on: Sep 18, 2025 | 10:11 AM

సెప్టెంబర్ 17తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి బ్రిటిష్ ప్రధాన మంత్రి జార్జియా మలోనీ వరకు, వాటికన్ నగర అధిపతి పోప్ లియో XIV కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీకి ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు .

బుధవారం (సెప్టెంబర్ 17) పవిత్ర వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో 30,000 మందికి పైగా ప్రజలు పాపల్ దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రత్యేక సమావేశంలో పోప్ లియో XIV యాత్రికులను ప్రబోధించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో, పోప్ లియో XIV ఇండియన్ మైనారిటీ అసోసియేషన్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. అక్కడ సార్వత్రిక కాథలిక్ చర్చి ఆధ్యాత్మిక అధిపతి పోప్ లియో XIV.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు.

రాజ్యసభ ఎంపీ సత్నామ్ సింగ్ సంధు, ఎంపీ, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ఐఎంఎఫ్ సమన్వయకర్త హిమాని సూద్‌లతో కలిసి ఐఎంఎఫ్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో పోప్ లియో XIV ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ఆశీర్వదించారు. ఎంపీ సత్నామ్ సింగ్ సంధు “హార్ట్ టు హార్ట్: ఎ సాగా ఆఫ్ రెవరెన్స్” అనే పుస్తకాన్ని బహుకరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిక్కు సమాజం మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..