PM Narendra Modi to meet Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ ఖరారైంది. సెప్టెంబర్ 24 (శుక్రవారం) ఇరు దేశాల అధినేతలు శ్వేతసౌధంలో సమావేశం కానున్నారు. క్వాడ్ దేశాల సదస్సు సందర్భంగా శుక్రవారం ఇదు దేశాల నేతలు భేటీ అవుతారని ఈ మేరకు వైట్ హౌస్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ యూఎస్ పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. బైడెన్‌తో జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. దీంతోపాటు తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన పరిస్థితులు, కోవిడ్-19 వ్యాక్సిన్.. తదితర విషయాలు చర్చించే అవకాశం ఉంది. అదే రోజు జరిగే.. క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోదీ, బైడెన్, జపాన్ ప్రధాని సుగా యోషిహిడే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిహిడే సుగతోనూ బైడెన్ విడిగా భేటీకానున్నారు. ఈ భేటీల అనంతరం ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో కలిపి అవుకుస్ (ఏయూకేయూఎస్) కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు. కాగా.. క్వాడ్ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆలస్యంగా పాల్గొననున్నట్లు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: