ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహును ప్రశంసించిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శాంతి ప్రణాళిక ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ సంతకాలు చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. త్వరలో బందీలు, ఖైదీలు కూడా విడుదల అవుతారని ట్రంప్ తెలిపారు. 2, 3 రోజుల్లో 20 మంది బందీలు విడుదలయ్యే అవకాశం ఉంది. గాజాలో మెజార్టీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడనున్నాయి.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహును ప్రశంసించిన ప్రధాని మోదీ
Narendra Modi ,donald Trump

Updated on: Oct 09, 2025 | 11:30 AM

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శాంతి ప్రణాళిక ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ సంతకాలు చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అయితే గాజా యుద్ధ విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు ప్రధాని మోదీ. ఇది ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సమర్థ నాయకత్వానికి నిదర్శనమన్నారు. ఒప్పందంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారని ఆకాంక్షించారు. గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందుతుందని.. శాశ్వత శాంతికి బాటలు పడతాయని ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. గాజాలో మెజార్టీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడనున్నాయి.

మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. శాంతి ప్రణాళిక ఒప్పందంపై ఇజ్రాయెల్-హమాస్ సంతకాలు చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. త్వరలో బందీలు, ఖైదీలు కూడా విడుదల అవుతారని ట్రంప్ తెలిపారు. 2, 3 రోజుల్లో 20 మంది బందీలు విడుదలయ్యే అవకాశం ఉంది. గాజాలో మెజార్టీ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడనున్నాయి.