PM Modi: కొనసాగుతోన్న మోదీ ఈజిప్ట్‌ టూర్‌.. వెయ్యేళ్ల మసీదును సందర్శించిన ప్రధాని.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్‌ పర్యటన కొనసాగుతోంది. అమెరికాలో నాలుగు రోజుల పర్యాటన ముగించుకొని శనివారం ప్రధాని ఈజిప్ట్‌ చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం కైరోకు చేరుకున్న ప్రధానికి ఈజిప్టు ప్రధాని మొస్తఫా మద్‌బౌలీ స్వాగతం పలికారు. ఈజిప్ట్‌లో మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు....

PM Modi: కొనసాగుతోన్న మోదీ ఈజిప్ట్‌ టూర్‌.. వెయ్యేళ్ల మసీదును సందర్శించిన ప్రధాని.
Pm Modi

Updated on: Jun 25, 2023 | 2:34 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్‌ పర్యటన కొనసాగుతోంది. అమెరికాలో నాలుగు రోజుల పర్యాటన ముగించుకొని శనివారం ప్రధాని ఈజిప్ట్‌ చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం కైరోకు చేరుకున్న ప్రధానికి ఈజిప్టు ప్రధాని మొస్తఫా మద్‌బౌలీ స్వాగతం పలికారు. ఈజిప్ట్‌లో మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పీఎమ్‌ వెయ్యేళ్ల చరిత్ర ఉన్న అల్‌హకీం మసీదును సందర్శించారు. భారత్‌కు చెందిన దావూదీ బోహ్రా ముస్లింలు ఈ మసీదును సాంస్కృతి ప్రదేశంగా భావిస్తారు.

అనంతరం నరేంద్ర మోదీ ఫస్ట్‌ వరల్డ్‌ వార్‌లో మరణించిన దాదాపు 4వేల మంది సైనికుల స్మారక చిహ్నాన్ని సందర్శించారు. కైరోలోని హెలియోపోలీస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ శ్మశాన వాటిక వద్ద నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అనంతరం ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతే ఎల్‌సిసితో భేటీ అయిన మోదీ దౌత్య సంబంధాలపై చర్చించారు.

ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా భారత్‌, ఈజిప్ట్ దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. టెక్నాలజీ, బిజినెస్, కల్చర్‌, అగ్రికల్చర్‌, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. మోదీ పర్యటనో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఈజిప్టు రాయబరి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..