Yoga Day: యోగా అంటేనే అందరినీ కలిపేది.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నరేంద్ర మోదీ.

న్యూయార్క్‌లోని UNO ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'మీరంతా చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు...

Yoga Day: యోగా అంటేనే అందరినీ కలిపేది.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నరేంద్ర మోదీ.
PM Modi

Updated on: Jun 21, 2023 | 8:10 PM

న్యూయార్క్‌లోని UNO ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మీరంతా చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రతీ దేశానికి చెందిన వ్యక్తులు ఇక్కడున్నారని నాకు తెలిసింది. యోగా అంటే ఐక్యత. 9 ఏళ్ల క్రితం ఇక్కడే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టాం. యోగా అంటేనే అందరినీ కలిపేది’ అని చెప్పుకొచ్చారు.

మోదీ ఇంకా మాట్లాడుతూ.. 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించిందని మోదీ గుర్తుచేశారు. యోగా.. భారత్‌లో ప్రాచీనకాలం నుంచి కొనసాగుతోన్న ప్రక్రియ అని అన్నారు. యోగా చేసేందుకు ఎలాంటి పేటెంట్ హక్కులు అవసరం లేదని, ఇది అన్ని దేశాల సంప్రదాయలకు సరిపోయే విధానం అని మోదీ అన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, మీడియా ప్రముఖులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు యోగా చేశారు. యోగా డే కార్యక్రమంలో 180 కంటే ఎక్కువ దేశాలకు చెందిన ప్రజలు ప్రధానితో యోగాలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా డేలో ప్రధానితో కలిసి యోగా చేసిన కొందరు ప్రముఖుల వీళ్లే.. సబా కొరోసి, యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ, హంగేరియన్‌ దౌత్యవేత్త, ప్రస్తుతం 77వ అధ్యక్షుడు. మిస్టర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్‌ నగర 110వ మేయర్, అమీనా జె.మహమ్మద్, ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిస్టర్ రిచర్డ్ గేర్, (ప్రముఖ హాలీవుడ్ నటుడు), మిస్టర్ వాలా అఫ్సర్, సేల్స్‌ఫోర్స్‌లో చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్. జే శెట్టి, అవార్డు గ్రహిత, వికాస్ ఖన్నా, అవార్డు గెలుచుకున్న భారతీయ చెఫ్, రెస్టారెంట్‌, టీవీ షో మాస్టర్‌చెఫ్ ఇండియా హోస్ట్, మైక్ హేస్, సిలికాన్ వ్యాలీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్ మేజర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..