- Telugu News Photo Gallery PM Narendra Modi Leads Yoga Day Celebrations At UN Headquarters In New york, See Photos
PM Modi: అగ్రరాజ్యం అమెరికాలో యోగా డే.. ఐరాసలో నరేంద్ర మోదీ యోగ సాధన..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి నార్త్ లాన్‌లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. యోగా సెషన్‌ను మోదీ స్వయంగా లీడ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా మోదీ ప్రాముఖ్యత, ఆవష్యకతను మోదీ వివరించారు..
Updated on: Jun 21, 2023 | 9:30 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగానే అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అందరిలో ఒకరై యోగా సాధన చేశారు. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను, ఆవష్యకతను వివరించారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. యోగా అటేనే ఐక్యత అని అభివర్ణించిన మోదీ 9 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లోనే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

యోగా.. భారత్‌లో ప్రాచీనకాలం నుంచి కొనసాగుతోన్న ప్రక్రియ అన్న నరేంద్ర మోదీ.. యోగా చేసేందుకు ఎలాంటి పేటెంట్ హక్కులు అవసరం లేదని, ఇది అన్ని దేశాల సంప్రదాయలకు సరిపోయే విధానం అని చెప్పుకొచ్చారు.

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, మీడియా ప్రముఖులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు పాల్గొన్నారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల్లో సబా కొరోసి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, హంగేరియన్ దౌత్యవేత్త, ప్రస్తుతం 77వ అధ్యక్షుడు. మిస్టర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ నగర 110వ మేయర్, అమీనా జె.మహమ్మద్, ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిస్టర్ రిచర్డ్ గేర్ సిలికాన్ వ్యాలీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్ మేజర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద యోగా దినోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యే కంటే ముందే మోదీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

యోగా దినోత్సవం అందరినీ మరింత దగ్గర చేసిందన్న మోదీ.. యోగా మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందన్నారు. భారత్ పిలుపు మేరకు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఏకతాటిపైకి రావడం చారిత్రాత్మకం అని అభిప్రాయపడ్డారు.

యూఎన్ జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదన వచ్చినప్పుడు రికార్డు స్థాయిలో దేశాలు మద్దతిచ్చాయన్న ప్రధాని, అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు.

యోగా ద్వారా మన వైరుధ్యాలు చెరిపేయాలన్న మోదీ, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ ను ప్రపంచానికి అందించాలని పిలుపునిచ్చారు. కర్మలో నైపుణ్యమే యోగం అని చెప్పారు. మనందరికీ ఈ మంత్రం చాలా ముఖ్యమైందని తెలిపారు.
