భారత్‌-అమెరికా బంధాన్ని కొత్తగా నిర్వచించిన ప్రధాని మోదీ! “MAGA+MIGA=MEGA” అంటే ఏంటంటే?

భారత్-అమెరికా మైత్రి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. మగా ప్లస్ మిగా ఈక్వాల్ టూ మెగా అంటూ అద్భుతమైన ఈక్వేషన్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఈక్వేషన్ కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వస్తుంది. అసలింతకీ ఈ మగా ప్లస్ మిగా ఈక్వల్ టూ మెగా అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం..

భారత్‌-అమెరికా బంధాన్ని కొత్తగా నిర్వచించిన ప్రధాని మోదీ! MAGA+MIGA=MEGA అంటే ఏంటంటే?
Modi Trump

Updated on: Feb 14, 2025 | 11:42 AM

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం అయ్యారు. దేశ అధ్యక్షుడి అధికారక భవనం వైట్‌ హౌజ్‌లో ట్రంప్‌-మోదీ భేటీ అయ్యారు. వీరిమధ్య రక్షణ, వాణిజ్య, అక్రమ వలసలు, సుంకారలపై చర్యలు జరిగాయి. అయితే.. ట్రంప్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతాలో ఒక ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. భారత్‌-అమెరికా బంధాన్ని ఆయన కొత్తగా నిర్వచించారని చెప్పవచ్చు. “MAGA+MIGA=MEGA” అనే ఈక్వెషన్‌ను పేర్కొన్నారు. MAGA అంటే Make America Great Again,MIGA అంటే Make India Great Again అని అర్థం. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌, ప్రచార సమయంలో ఎక్కువగా వాడిన మాట మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ అనే విషయం తెలిసిందే. అలాగే గత 11 ఏళ్లుగా ఇండియాలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న మాట వికసిత్‌ భాతర్‌.

దీన్నే అమెరికా పరిభాషలో చెప్పాలంటే మేక్‌ ఇండియా గ్రేట్‌ అగైన్‌ అని మోదీ పేర్కొన్నారు. ఇలా మగా ప్లస్‌ మిగా కలిస్తే.. మెగా భాగస్వామ్యం అవుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ ఈక్వేషన్‌ ఇరు దేశాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రధాని మోదీ మంచి వక్త అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా పర్యటనలో కూడా మోదీ ప్రసంగం ఆకట్టుకుంది. అలాగే అక్రమ వలసలపై కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన భారతీయులను తాము వెనక్కితీసుకుంటామంటూ ప్రకటించారు. అక్రమ వలసలను అరికట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని మోదీ పేర్కొన్నారు. కొంతమంది డబ్బుకోసం ఆశపడి, అమాయక యువతను అక్రమంగా అమెరికాకు పంపిస్తున్నారని, ఈ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ను అరికట్టాలని పిలుపునిచ్చారు.

ఇక ఈ భేటీలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇండియా తన ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తుందని, తాము కూడా ఇండియా దిగుమతులపై ట్యాన్స్‌ను పెంచుతామని అన్నారు. అలాగే 2030 కల్లా ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలను 500 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్తామని ఇరు దేశాల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల జాయింట్‌ డెవలప్‌మెంట్‌, జాయింట్‌ ప్రొడక్షన్‌తో పాటు టెక్నాలజీ మార్పడికి సహకరించుకుంటామని వెల్లడించారు. కాగా ట్రంప్‌-మోదీ భేటీలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ దోవల్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..