PM Modi: ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన స్వీడన్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ పర్యటనలో ఉన్న మోదీకి అక్కడి ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పురస్కారంమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్‌ను బహుకరించింది. ఒక దేశ ప్రభుత్వ అధినేతకు అందించే అత్యున్నత గౌరవంగా ఈ అవార్డును పరిగణిస్తారు.

PM Modi: ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన స్వీడన్
Pm Modi Conferred Sweden's Top Award

Updated on: May 18, 2026 | 6:48 AM

స్వీడన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ పురస్కారం అభించింది. స్వీడన్ ప్రభుత్వం తమదేశ అత్యున్నత ప్రతిష్టాత్మకమైన పురస్కారంమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్‌ (Royal Order of Polar Star, Commander Grand Cross)ను ప్రధాని మోదీకి బహుకరించింది. ఒక దేశ ప్రభుత్వ అధినేతకు అందించే అత్యున్నత గౌరవంగా ఈ అవార్డును పరిగణిస్తారు. తాజా అవార్డుతో ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా వివిధ దేశాలు, సంస్థల నుండి లభించిన అత్యున్నత పురస్కాలకు సంఖ్యం 31కి చేరింది. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను, వ్యూహాత్మక బంధాలను బలపర్చడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగా స్వీడన్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది.

ఇదేకాదు అంతకు ముందు స్వీడన్‌ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ విమానానికి ఇరువైపులా స్వీడిష్ ఫైటర్ జెట్స్ చక్కర్లు కొడుతూ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికాయి. గోథెన్‌బర్గ్‌లో విమానం ల్యాండయ్యాక ఆ దేశ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌.. మోదీకి ఘన స్వాగతం పలికారు. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ బంధానికి ఈ స్వాగతం ప్రతీకగా నిలిచింది.

ఇక, స్వీడన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ దిగ్గజ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగస్వాములు కావాలని స్వీడన్‌ కంపెనీలకు పిలుపునిచ్చారు. అలాగే, యువరాణి విక్టోరియా, స్వీడన్‌ ప్రధానితో మోదీ చర్చలు జరిపారు .రక్షణ రంగం, సెమీ కండక్టర్‌, డిజిటల్ టెక్నాలజీలో పరస్పర సహకారంపై ఒప్పందాలు చేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us