ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించి ఉక్రెయిన్‌పై ఆ దేశం కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపే శక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్, మోడీ మధ్య చర్చల కోసం తాము ఎలాంటి ప్రయత్నాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దురాక్రమణను ఆపేందుకు అమెరికా ఎటువంటి ప్రయత్నాన్ని అయినా స్వాగతిస్తుందన్నారు.
ఉక్రెయిన్-రష్యా మద్య ఉన్న శత్రత్వాన్ని ముగింపు పలికే ఏ ప్రయత్నానికి కూడా మద్దతిస్తామన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ శక్తి గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందని, ప్రధాని మోడీ మాత్రమే పుతిన్‌ను ఒప్పించగలరని భావిస్తున్నానని అన్నారు. అయితే పుతిన్‌తో మాట్లాడేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని, రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్‌ను ఆపగలిగే ఏమైనా మార్గాలు ఉన్నా ఆమెరికా సాధారంగా స్వాగతిస్తుందని వ్యాఖ్యానించారు.
#WATCH | I’ll let the PM speak to whatever efforts he’s willing to undertake. US would welcome any effort that could lead to an end of hostilities in Ukraine: John Kirby on being asked if there is still time for PM Modi to stop the war or convince President Putin
(Source: WH) pic.twitter.com/6BOiR3VKea
— ANI (@ANI) February 10, 2023
అయితే జాతీయ సలహాదారు అజిత్ దోవల్ పుతిన్‌ను కలిసిన మరుసటి రోజే జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ తలచుకుంటే ఇప్పటికిప్పుడే ఈ యుద్ధానికి ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఇరు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ మాట్లాడారు. చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధాల తరం కాదని, ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కించాలని ఉజ్బెకిస్తాన్‌లో నిర్వహించిన సమ్మిట్‌లో పుతిన్‌కు నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణలో 10 పాయింట్లతో కూడిన పీస్ ఫార్ములా గురించి చర్చించారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపే పలికే సమయం ఆసన్నమైందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావిస్తున్నారని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అధ్యక్షుడు పుతిన్ కారణమని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించారు. ఉక్రేనియన్ ప్రజలకు ఏం జరిగినా దానికి వ్లాదిమిర్ పుతిన్ మాత్రమే బాధ్యత వహిస్తాడని అన్నారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపకుండా సమస్యలు మరింతగా పెరిగిపోతాయని పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి