ఆకాశంలో యాక్సిడెంట్.. ఏడుగురు మృతి

ఆకాశంలో యాక్సిడెంట్.. ఏడుగురు మృతి

హెలికాఫ్టర్, ఎయిర్ క్రాఫ్ట్ ఢీ కొట్టుకున్న ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.స్పెయిన్‌లోని మల్లోర్కా ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు గాలిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్పెయిన్ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. ఇద్దరు పైలెట్లతో ఉన్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్, ఐదుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్.. ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి. ఈ విషయాన్ని స్పెయిన్ పోలీసు అధికారి వెల్లడించారు. హెలికాఫ్టర్‌లో ఇద్దరు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 4:42 PM

హెలికాఫ్టర్, ఎయిర్ క్రాఫ్ట్ ఢీ కొట్టుకున్న ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.స్పెయిన్‌లోని మల్లోర్కా ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు గాలిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్పెయిన్ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇద్దరు పైలెట్లతో ఉన్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్, ఐదుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్.. ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి. ఈ విషయాన్ని స్పెయిన్ పోలీసు అధికారి వెల్లడించారు. హెలికాఫ్టర్‌లో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు, ఒక పైలట్ ఉన్నారు. హెలికాఫ్టర్‌కు జర్మనీ రిజిస్ట్రేషన్‌ ఉందన్న అధికారులు.. మృతుల వివరాలు తెలియరాలేదన్నారు.

మల్లోర్కా సహా.. స్పెయిన్‌లోని కొన్ని దీవులకు ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. వేసవి కాలంలో వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రమాదంపై స్పెయిన్ ప్రధానమంత్రి స్పెర్డో స్పెంచెజ్ ఆరా తీశారు. మరణించిన వారికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu